ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు చొరబడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. తొలిరోజు యుద్ధంలో 137 మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. స్నేక్ ద్వీపంలో తమకు లొంగేందుకు ససేమిరా అన్న 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు హతమార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






దేశం కోసం


స్నేక్ ఐల్యాండ్‌ను కాపాడేందుకు ఆ ప్రాంతంలో సైనిక శిబిరం ఏర్పాటు చేసింది ఉక్రెయిన్. ఆ శిబిరంలోకి చొరబడిన రష్యా దళాలు.. వారిని ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని కోరాయి. అయితే ఆ శిబిరంలో సైనికులు మాత్రం సరెండర్ అయ్యేందుకు ససేమిరా అన్నారు. దీంతో వారిని రష్యా బలగాలు కాల్చి చంపాయి.


హీరో ఆఫ్ ఉక్రెయిన్



దేశం కోసం అమరులైన 13 మంది సైనికులకు 'హీరో ఆఫ్ ఉక్రెయిన్' అవార్డును ప్రకటించారు అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌కు 30 మైళ్ల దూరంలో 42 ఎకరాల్లో స్నేక్ ఐల్యాండ్‌ ఉంది. ఉక్రెయిన్ ప్రాదేశిక జలాలకు సమీపంలో ఈ ఐల్యాండ్ ఉంది. బ్లాక్ సీలో ఇది చాలా వ్యూహాత్మక ప్రాంతం.

 

నేేనే టార్గెట్

 

రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.