Ukraine on Putin: ఇద్దరు పుతిన్‌లు ఉన్నారు! ఇవి గమనించారా?- బయటపడ్డ సంచలన విషయం!

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 06 Aug 2022 04:22 PM (IST)

Ukraine on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది.

పుతిన్ డబుల్ యాక్షన్

NEXT PREV

Ukraine on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఏ వార్త బయటకు వచ్చినా వైరల్ అవుతూనే ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్యం గురించి, ప్రేయసి గురించి.. ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో సంచలన వార్త బయటకు వచ్చింది.

Continues below advertisement


డబుల్ యాక్షన్


పుతిన్‌ అచ్చం తనలాగే ఉండే మరో వ్యక్తిని డూప్‌గా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తాజాగా సంచలన ఆరోపణలు చేసింది ఉక్రెయిన్‌. ఈ మేరకు రక్షణ నిఘా విభాగం చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కిరిలో బుడనోవ్‌ అన్నారు.






ఓ టీవీ ఛానల్‌లో ఆయన రష్యా అధ్యక్షుడి పాత, కొత్త ఫొటోల మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపించారు. అందులో పుతిన్.. విమానం నుంచి కిందకు దిగుతోన్న ఓ వీడియోను ప్రదర్శించారు. ఇందులో కనిపిస్తోన్న వ్యక్తి పుతిన్‌ పోలికలు ఉన్న వ్యక్తి అని, ఆయన కాదని ఆరోపించారు.


వేలిముద్రల లాగే ప్రతి వ్యక్తి చెవి ఆకారం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. పుతిన్‌ పాత, కొత్త ఫొటోల్లోని చెవుల ఆకారంలో తేడాలున్నాయని తెలిపారు.


ఇటీవల


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్య విషయంపై తాజాగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యం బారినపడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అర్ధరాత్రి సమయంలో పుతిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పారామెడికల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం.



జులై 22 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర వికారంగా ఉన్నట్లు పుతిన్‌ తన సహాయకులకు చెప్పారు. విధుల్లో ఉన్న పారామెడికల్‌ సిబ్బంది ఓ ఇరవై నిమిషాలపాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. తర్వాత పరిస్థితి కుదుటపడకపోవడంతో వెంటనే ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పుతిన్‌ ఛాంబర్‌కు చేరుకున్న వైద్య బృందం.. మూడు గంటలపాటు చికిత్స అందించింది.                 - రష్యా మీడియా


Also Read: Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్


Also Read: Punjab News : ఆరు రూపాయలతో కోటీశ్వరుడు, అదృష్టమంటే ఈ కానిస్టేబుల్ దే!

Published at: 06 Aug 2022 03:46 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.