TDP National Flag :  తెలుగుదేశం పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాల డీపీలన్నింటినీ మార్చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న " అజాదీ కా అమృత్ మహోత్సవ్ " కమిటీ భేటీలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో  చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు పార్టీకి చెందిన అన్ని విభాగాల సోషల్ మీడియా ఖాతాల డీపీలను మార్చారు. 






అన్ని విభాగాల సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు మార్చేసిన టీడీపీ


తెలుగు దేశం పార్టీకి చెందిన అధికారిక అకౌంట్లు మాత్రమే కాకుండా.. చంద్రబాబు , లోకేష్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలడీపీలను త్రివర్ణ పతాకంతో రీప్లేస్ చేశారు.


 


 


మోదీతో అజాదీ కా అమృత్ మహోత్సవ్ భేటీకి ముందు కీలక నిర్ణయం


అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  అందరూ డీపీలు మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.  ఆగస్టు రెండో తేదీ నుంచి ఈ డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అయితే  తెలుగుదేశం పార్టీ నేతలు... ఆపార్టీ ఆరో తేదీ నుంచి డీపీలు మార్చుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ మెంబర్‌గా ఉండి.. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించకపోతే విమర్శలు వస్తాయన్న కారణంగా టీడీపీ ఈ డీపీలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. 


బీజేపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో డీపీలు మార్చింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే !


తెలుగు రాాష్ట్రాల్లో ఇలా మోదీ పిలుపు మేరకు  డీపీలను ఏ ఇతర రాజకీయ పార్టీ మార్చుకోలేదు. బీజేపీతో పాటు ఆ పార్టీ నేతలు డీపీలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..  ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసుకోలేదు.  డీపీలు మార్చితే జీడీపీలు పెరుగుతాయా అని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల తీరుపై విమర్సలు చేస్తున్నారు.