శ్రీముఖి (Sreemukhi) కి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమెను అభిమానులు ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆమెకు భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి శ్రీముఖిని ఫేమస్ టీవీ సెలబ్రిటీ, సినిమాల్లో కూడా హాస్య నటుడిగా కనిపిస్తున్న 'హైపర్' ఆది (Hyper Aadi) భయపెట్టారు. అదీ ఎంత ఎలా భయపెట్టారంటే... శ్రీముఖి స్టేజి వదిలి కిందకు పరుగులు తీసేలా! భయం అంటే వార్నింగ్ గట్రా ఇవ్వలేదు. ముద్దులతో భయపెట్టారు. అలా కూడా భయానికి గురి చేయవచ్చా? అంటే అసలు వివరాల్లోకి వెళ్ళాలి మరి!

Continues below advertisement


మూడ్ వస్తే ముద్దులు పెడతా!
రాఖీ (Raksha Bandhan 2022) పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ 'హలో బ్రదర్' అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. ఆగస్టు 7న ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. లేటెస్టుగా ప్రోమో విడుదల చేశారు. అందులో 'హైపర్' ఆది, 'ఆటో' రామ్ ప్రసాద్ మధ్య శ్రీముఖి ఒక పోటీ పెట్టారు.


ఒక సాంగ్ ప్లే చేస్తామని, ఆ పాటలో ఏయే వస్తువుల పేర్లు అయితే ఉన్నాయో... వాటిని తీసుకు వచ్చి తన చేతిలో ఎవరు అయితే ముందుగా పెడతారో? వాళ్ళు గెలిచినట్టు, ఎవరు అయితే తర్వాత పెడతారో వాళ్ళు ఓడినట్టు అని శ్రీముఖి చెప్పారు. 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో ఐటమ్ సాంగ్ 'ఆకలేస్తే అన్నం పెడతా...' ముందుగా ప్లే అయ్యింది. అందులో 'మూడ్ వస్తే ముద్దులు పెడతా' అని ఉంటుంది కదా! అందుకని, వస్తువులను వదిలేసి శ్రీముఖి దగ్గరకు వెళ్లి ఆది, రామ్ ప్రసాద్ ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్... అదీ చేతి మీదే అనుకోండి. వాళ్ళిద్దరూ చేసిన పనికి శ్రీముఖి షాక్ తిన్నారు (Hyper Aadi Tried To Kiss Sreemukhi).
 
నవీన్ చంద్రకు శ్రీముఖి ముద్దు
శ్రీముఖికి ముద్దు పెట్టాలని 'హైపర్' ఆది, 'ఆటో' రామ్ ప్రసాద్ ట్రై చేస్తే... శ్రీముఖి మాత్రం నవీన్ చంద్రకు ముద్దు పెట్టారు (Sreemukhi Kissed Naveen Chandra). నవీన్ చంద్ర బుగ్గ మీద ముద్దు పెట్టమని వేలితో చూపించడంతో ముద్దు పెట్టినట్టు చేశారు శ్రీముఖి. అంతే కాదు... ఆయన్ను బావా అని పిలవడం కూడా విశేషం. ఆ తర్వాత 'మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది...' సాంగ్ ప్లే అయ్యింది. అంతే... శ్రీముఖికి విషయం అర్థం అయ్యింది. తన వైపు ఆది రావడం గమనించి స్టేజి మీద నుంచి కిందకు పరుగులు తీశారు.  


Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?


'హలో బ్రదర్'లో దివంగత హీరో ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేశారు. ఆయనకు నివాళిగా ఆయన జీవితాన్ని పెర్ఫార్మన్స్ రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో రీతూ చౌదరి,  భాను శ్రీ తదితరులు సందడి చేశారు. 


Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్