ABP  WhatsApp

Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్

ABP Desam Updated at: 06 Aug 2022 11:40 AM (IST)
Edited By: Murali Krishna

Raksha Bandhan 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ఓ బహుమతి ప్రకటించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్

NEXT PREV

Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ బహుమతి ప్రకటించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశమిచ్చారు.



రక్షాబంధన్ సందర్భంగా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. రెండు రోజుల పాటు ఇందుకు అవకాశం కల్పించాం.                                                                      - యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం


ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 12 అర్ధరాత్రి వరకు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 


కాంగ్రెస్‌పై ఫైర్


మరోవైపు శుక్రవారం కాంగ్రెస్ చేసిన నిరసనలపై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య దివస్ రోజున నల్లబట్టలు వేసుకుని కాంగ్రెస్ నిరసన తెలపడం రామభక్తులకు అవమానమని ఆయన అన్నారు.





ఇన్నాళ్లూ కాంగ్రెస్ సాధారణంగా నిరసనలు చేసింది కానీ శుక్రవారం మాత్రం నల్ల బట్టలు వేసుకుని ఆందోళన చేశారు. ఇది రామభక్తులకు అవమానం. అయోధ్య దివస్ రోజున, రామ జన్మభూమి మందిర నిర్మాణం మొదలైన రోజున వాళ్లు ఇలా చేయడం దారుణం.                                                 -   యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం


Also Read: Punjab News : ఆరు రూపాయలతో కోటీశ్వరుడు, అదృష్టమంటే ఈ కానిస్టేబుల్ దే!


Also Read: Love Marriage: ఏపీ అమ్మాయి, అమెరికా అబ్బాయి - హిందూ సాంప్రదాయంలో ఘనంగా వివాహం

Published at: 06 Aug 2022 11:02 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.