AP Techie Married US Man: సాధారణంగా ప్రేమకు కులం, మతం అనే తారతమ్యాలు ఉండదు. కొన్ని ప్రేమలలో వయసు సైతం వారికి అడ్డంకి కాదు. ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం కలిగితే చాలు స్నేహంగా మొదలై, కొన్నిసార్లు ప్రేమగా మారుతుంది. ఒకరి ప్రేమకు మరోకరు దాసులు అవ్వడమే కాకుండా ఒకరి కోసం మరొకరు‌ ప్రాణాలను అర్పించేందుకు సైతం సిద్ద పడుతుంటారు. ఇరువురి మధ్య చిగురించిన ప్రేమకు పెద్దలు అంగీకారం‌ తెలిపి భాజా భజంత్రీలు నడుమ పెళ్లి పీఠలు ఎక్కిస్తే.. ఇక వారి జీవితం అంతా సుఖంగా సాగిపోతుంది. 
అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి..
ఆధునికత పెరిగే‌కొద్ది కులాలు, మతాలు చూడకుండా ప్రేమించేస్తుంటే.. మరికొందరేమో ఏకంగా ఖండాంతరాలు దాటి ప్రేమలో పడి పోతున్నారు. ఇద్దరి మనసులు కలిస్తే చాలు ప్రేమ అనే లోకంలో ముగిని తేలి పోతారు. తాజాగా అమెరికాలో ఉద్యోగానికి వెళ్ళిన తెలుగు అమ్మాయికి, అమెరికా అబ్బాయికి మధ్య ప్రేమ చిగురించింది. ఒకే సంస్ధలో పని చేస్తుండడంతో మరింత గాఢంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం ఇద్దరు కలిసి జీవించాలని కలలు కన్నారు. అదే తడువుగా ఇరువురి ప్రేమను కన్నవారికి చెప్పి పెళ్లికి పెద్దల అంగీకారం తీసుకున్నారు. ఇక తెలుగు అమ్మాయి కుటుంబ సభ్యుల కోరిక మేరకు శ్రీనివాసుడి పాదాల చెంత తిరుపతిలో అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.


తిరుపతి టు బోస్టన్.. అక్కడే ప్రేమ
తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె టి.హర్షవి బీటెక్‌ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్‌ మహా నగరంలోని అత్‌హెనా హెల్త్‌ అనే సంస్థలో ఉద్యోగంలో చేరింది.. అదే సంస్థలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న అమెరికాకు చేందిన డామియన్‌ ఫ్రాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఇక వృత్తి రిత్యా ఇద్దరూ ఒకే చోట చేయడంతో తరచూ మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించేవారు. ఇలా ఒకరికి‌ ఒకరు సహాయ సహకారాలు అందిస్తూ సాగిపోయే సరికి, మనసులు కలిసి వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఇష్టాయిష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇద్దరి అభిప్రాయం ఒక్కటి కావడంతో ప్రేమికులుగా కొద్దికాలం గడిచిపోయింది. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా ఇద్దరూ ప్రేమలో మునిగి పోయారు. జీవితాంతం ఇద్దరూ కలిసే జీవించాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించారు.


పెద్దల అంగీకారం, పెళ్లితో శుభం కార్డ్
ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో వివాహ వేడుకను ముందుగా అమెరికాలో నిర్వహించాలని అనుకున్నా, ఆ తరువాత కుమార్తె తల్లిదండ్రులు, బంధువుల కోరిక మేరకు తిరుపతిలోని ఓ హోటల్‌లో గురువారం రాత్రి వివాహం నిర్వహించగా, ఈ వివాహ వేడుకలకు పెళ్లి కుమారుడి తండ్రి స్కాట్ బుషార్డ్, తల్లి అన్నా బుషార్డ్, వరుడి తమ్ముడు, అతని భార్య తెలుగింటి వివాహానికి హాజరయ్యారు. ఇక అందరి సమక్షంలో అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా జరిగింది.