China Taiwan Issue: అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా ప్రతీకార చర్యలకు తెరలేపింది. ఇప్పటికీ తైవాన్‌పై ఆంక్షలు విధించిన చైనా తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. స్పీకర్ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
చైనాలోని షింజియాంగ్, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది చైనా.
వెనక్కి తగ్గని పెలోసీ
పెలోసీ తైవాన్ పర్యాటనపై ముందు నుంచే చైనా మండిపడుతోంది. అయినప్పటికీ పెలోసీ తైపీలో పర్యటించారు. అయితే తైవాన్‌ను ఒంటరి చేయాలన్న చైనా ఆలోచనను అమెరికా సహించదని పెలోసీ అన్నారు. టోక్యో పర్యటనలో ఉన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె ఆసియా టూర్‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె తైవాన్‌లోనూ పర్యటించటంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. "చైనా తైవాన్‌కు మరో దేశంతో సంబంధం లేకుండా అడ్డుకుంటుందేమో. కానీ ఈ దేశాన్ని పూర్తిగా ఒంటరిగా మాత్రం మార్చలేదు. అందుకు మేం ఒప్పుకునేదే లేదు. మేమెక్కడ పర్యటించాలన్నది చైనా ప్లాన్ చేయలేదు" అని స్పష్టం చేశారు
Also Read: Thailand Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం- 13 మంది మృతి, 40 మందికి గాయాలు
Also Read: Rahul Gandhi Detained: కాంగ్రెస్ నిరసనలతో దిల్లీలో ఉద్రిక్తత- రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్