ABP  WhatsApp

Rahul Gandhi Detained: కాంగ్రెస్ నిరసనలతో దిల్లీలో ఉద్రిక్తత- రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్

ABP Desam Updated at: 05 Aug 2022 01:30 PM (IST)
Edited By: Murali Krishna

Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

Rahul Gandhi Detained: నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీలతో పాటు రాహుల్ గాంధీ దిల్లీలో ఈ నిరసనల్లో పాల్గొన్నారు. విజయ్‌చౌక్ వద్ద రాహుల్ గాంధీ, శశిథరూర్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






పార్లమెంటు బిల్డింగ్ ప్రాంతంలో పార్టీ సభ్యులతో కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ నిరసనలకు నేతృత్వం వహించారు.



ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలంతా రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ చేశారు. కానీ ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెరపైకి తీసుకురావడం మా బాధ్యత. కానీ అలా చేసినందుకు కొంత మంది ఎంపీలను అరెస్ట్ చేశారు. దాడి చేస్తున్నారు.                                                     -   రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


విమర్శలు


అంతకుముందు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ.


ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ మనం నిర్మించుకున్న దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ నియంత రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై దాడులు చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింసకు వ్యతిరేకంగా మాట్లాడకుండా విపక్షాల గళం నొక్కడమే వారి ఆలోచన. కేవలం నలుగురు, ఐదుగురు ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు ముగ్గురు వ్యాపారుల సంక్షేమం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. పోరాడుతూనే ఉంటాను. నేను ఎంత పోరాడితే వాళ్లు నాపై అంతలా దాడి చేస్తారు. నాపై దాడి చేయండి. నేను సంతోషంగా స్వీకరిస్తాను.                                                               "


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

 


Published at: 05 Aug 2022 01:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.