నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తాము రెడీ అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశ వివరాలను తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.


మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. ప్రజలు రాజగోపాల్‌ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. బీఎస్పీకి గెలుపు అనేది చారిత్రక అవసరమని అన్నారు. సామాజిక న్యాయమే అజెండాగా ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తామని కెప్పారు, వెళ్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


వచ్చే ఎన్నికల్లో పోటీ ఒంటరిగానే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.


Also Read: Telangana Politics : ఉప ఎన్నికలా ? ముందస్తు ఎన్నికలా ? తెలంగాణలో ఏం జరగబోతోంది ?


అగ్రవర్ణాల చేతిలోనే ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం అగ్ర వ‌ర్ణాల చేతిలో బందీగా ఉంద‌ని ప్రవీణ్ కుమార్ ఆవేద‌న వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజ‌లు కోరుకున్న రాష్ట్రం ఇలాంటిది కాదని చెప్పారు. బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల ప్రజ‌ల‌ను అగ్రవ‌ర్ణాల వారు అణ‌గ తొక్కుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు జరిగితే మునుగోడు నియోజవర్గ ప్రజలు క‌చ్చితంగా బుద్ది చెబుతారని ఆయన అన్నారు.


సోనియాకు రాజగోపాల్ లేఖ


మరోవైపు, మునుగోడులో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ పంపారు. తన రాజీనామాకు కారణం టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేనని అన్నారు.  రాజీనామాకు దారితీసిన పరిణామాలను రాజగోపాల్ రెడ్డి లేఖలో తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని అన్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నaట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.


Also Read: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రహస్య సమావేశం- త్వరలోనే రాజీనామా: బండి సంజయ్ లీక్స్