Rahul Gandhi Press Meet: విపక్షాలపై ఈడీ దాడులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కురిపించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఎలా గెలిచాడు? జర్మనీలో ఉన్న అన్ని సంస్థలను తన అధీనంలోకి తీసుకుని గెలిచాడు. నాకు కుడా అన్ని వ్యవస్థలను ఇచ్చేయండి. ఎన్నికల్లో ఎలా గెలవాలో మీకు చూపిస్తా. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
నిరసనలు
మరోవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కార్యాలయానికి వచ్చారు.
దీంతో దిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డా.ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్, 7 లోక్ కల్యాణ్ మార్గ్ సహా పలు ప్రాంతాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు సమస్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేస్తోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. దీంతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ లీడర్లు ప్రధాని నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.
Also Read: Rahul Gandhi PC Highlights: 'ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది- నాపై దాడి చేసినా ఓకే, దేనికైనా రెడీ'