Thailand Nightclub Fire: థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది.






ఇలా జరిగింది


రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 కిమీ దూరంలో ఉన్న సట్టహిప్‌ జిల్లాలోని మౌంటెన్‌ బీ నైట్‌స్పాట్‌ నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో నైట్‌క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే క్రమంగా క్లబ్‌ మొత్తానికి మంటలు విస్తరించాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మంటల్లో చిక్కుకుని 13 మంది మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నైట్‌క్లబ్‌ మొత్తం కాలిపోయింది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. 


వీడియోలు వైరల్






ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంటలకు భయపడి నైట్‌క్లబ్‌ నుంచి జనాలు పరగులు తీశారు. 


Also Read: Rahul Gandhi Detained: కాంగ్రెస్ నిరసనలతో దిల్లీలో ఉద్రిక్తత- రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్