Karnataka Maharashtra Row: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్ ఠాక్రే )వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray).. అసెంబ్లీలో సోమవారం ఓ డిమాండ్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదం (Karnataka Maharashtra Row) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భాష, సరిహద్దుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన విషయం అని అన్నారు.
శిందేపై
మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.
బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ కర్ణాటక నుంచి మహారాష్ట్రలో విలీనం అవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని ఉద్దవ్ అన్నారు. ఇలాగే మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయితీలు తెలంగాణలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేసినప్పుడు.. శిందే ప్రభుత్వానికి ఆ గ్రామ పంచాయితీలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఉందా అని ఠాక్రే ప్రశ్నించారు.
సరిహద్దు సమస్య
భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది.
Also Read: Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ!