Uber asked to pay  54,000 to Delhi resident for failing to provide cab on time : పొద్దున్నే ఎయిర్ పోర్టుకో రైల్వే స్టేషన్‌కో వెళ్లాలి. అప్పుడు ఏం చేస్తాం... ఓలా లేదా ఉబెర్‌లో షెడ్యూల్ క్యాబ్ బుక్ చేసుకుంటాం. ఖచ్చితంగా వస్తుంందని అనుకుంటాం..కానీ అలాట్ చేసిన క్యాబ్ క్యాన్సిల్ చేసుకుంటే..అప్పటికప్పుడు వేరేది బుక్ చేసుకోవడం అంత తేలిక కాదు.  చేసుకున్నా ఆలస్యం కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్నిచాలా మంది చూసి ఉంటారు. ఓలా , ఉబర్‌ను నమ్ముకకోవడం కన్నా వేరే ఆప్షన్ చూసి పెట్టుకోవడంబెటర్ అని వారంతా అనుకుని ఉంటారు. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర  సింగ్ కూడా అలాగే అనుకున్నారు. కానీ తనకు జరిరిగిన నష్టానికి సంబంధించి ఉబెర్‌ను మాత్రం వదిలి పెట్టకూడదనుకున్నారు. 


ఉబెర్ క్యాబ్ క్యాన్సిలేషన్ వల్ల  ఫ్లైట్ మిస్సయిన కస్టమర్                           


అందుకే ఢిల్లీ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఉబెర్ కంపెనీ తాను షెడ్యూల్ చేసిన క్యాబ్ ను క్యాన్సిల్ చేయడం వల్ల తాను ఫ్లైట్ మిస్సయ్యాయనని.. ఈ కారణంగా కనెక్టింగ్ ఫ్లైట్ కోసంకూడా బుక్ చేసుకున్న టిక్కెట్లు వృధా అయ్యాయని ఆయన వినియోగదారుల కోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసును విచారణ చేసిన వినియోగదారుల కోర్టు ఇది పూర్తిగా సేవాలోపమేనని స్ఫష్టం చేసింది. సమయానికి క్యాబ్ పంపిస్తామని అంగీకరించిన తర్వాత చివరి క్షణంలో రద్దు చేయడం అంటే వినియోగదారుడి నమ్మకాన్ని వమ్ము చేయడమేనని స్పష్టం చేసింది. 


వినియోగదారుల కోర్టులో రెండేళ్ల పాటు న్యాయపోరాటం                            


విచారణ తర్వాత న్యాయస్థానం ₹24,100 ను పరిహారం కింద చెల్లించాలని, న్యాయపరమైన ఖర్చులతో పాటు మానసిక వేదన కల్పించినందుకు మరో 30 వేలరూపాయలు చెల్లించాలని ఉబెర్ కంపెనీని వినియోగదారుల న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఉపేంద్ర సింగ్ ఈ ఫలితం రాబట్టుకోవడానికి దాదాపుగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేశారు.  నష్టపరిహారం కోసం కాకుండా ఉబెర్ కంపెనీ వల్ల తన లాంటి వాళ్లు ఎందరో నష్టపోతునన్నారని వారందరికీ మేలు చేసేందుకు ఆయన ఈ పోరాటం చేశారు. 



Also Read: Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!




క్యాబ్ సర్వీసులు ఇటీవలి కాలంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాస్త పీక్ టైమ్‌లో అయితే చార్జీలు ఎంత ఉంటాయో చెప్పడం కష్టం.అదే సమయంలో క్యాబ్ సమయానికి వస్తుందో రాదో చెప్పడం కూడా కష్టమే. ఇలాంటివి లెక్కలేనన్ని ఘటనలు జరుగుతున్నాయి. అందుకే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్కువ మంది న్యాయపోరాటం చేయలేకపోతున్నారు. కానీ న్యాయపోరాటం చేసిన వారు మాత్రం ఉబెర్ , ఓలా వంటి కంపెనీలదే తప్పని నిరూపిస్తున్నారు.  


Also Read:  'పురుషులకూ నెలసరి వస్తే తెలిసేది' - మధ్యప్రదేశ్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం