Types of Earthquakes: భూకంపం అనేది భూమి క్రస్ట్‌లోని టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల సంభవించే సహజ విపత్తు. రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూకంప తరంగాల రూపంలో పెద్ద మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. అవి భూ క్రస్ట్ గుండా ప్రయాణించి భూమిని కదిలిస్తాయి. ఈ ప్రకంకపనలు గుర్తించలేని స్థాయి నుండి రిక్టర్ స్కేలుపై 8 కూడా దాటిపోవచ్చు. అగ్నిపర్వతాలు, విధ్వంసక సంఘటనల, భూక్రస్ట్ లోని లోపాలతో ఒత్తిడి పెరిగి భూకంపాలు వస్తాయి. ఇవి భూభాగంపై సంభవిస్తే భూకంపంగా, సముద్రంలో సంభవిస్తే సునామీగా విపత్తు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో రోజూ భూకంపాలు సంభవిస్తాయి.


భారత్‌లో భూకంప జోన్లు..


భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా భారత భూభాగాన్ని సెస్మిక్ జోన్ మ్యాపింగ్ లో వివిధ జోన్లుగా విభజించారు. 



  • జోన్ -2: భూకంపాల వచ్చినా చాలా తక్కువ ప్రభావం ఉండే ప్రాంతాలను జోన్ -2లో ఉంచారు. ఈ ప్రాంతాల్లో వచ్చే భూకంప తీవ్రత ఎంఎస్కే 64 స్కేలుపై 7గా ఉంటుంది. ఈ జోన్ లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ప్రాంతాలు ఉన్నాయి.

  • జోన్-3: మూడో జోన్ లో భూకంపాలు సంభవించే అవకాశం మోస్తరు. ముంబయి, చెన్నై, కోల్ కతా నగరాలు ఈ జోన్ లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరం కూడా ఈ జోన్ కిందికే వస్తుంది. 

  • జోన్-4: ఈ జోన్ లో సంభవించి భూకంపాల తీవ్రత ఎంఎస్కే స్కేలుపై 8 వరకు ఉంటుంది. ఈ జోన్ లో భూకంపాల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా, మహారాష్ట్రలోని కొయానా ప్రాంతం 4వ జోన్ లో ఉన్నాయి. 

  • జోన్-5: ఈ జోన్ లో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. ముప్పు తీవ్రత చాలా ఎక్కువ. ఎంఎస్కే స్కేలుపై 9 వరకు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ కిందికే వస్తాయి.


భారత్ లో సంభవించే భూకంప రకాలు..



  1. ప్లేట్ బౌండరీ భూకంపాలు: ఈ భూకంపాలు రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులో సంభవిస్తాయి. హిమాలయ ప్రాంతం వంటి యురేషియన్ ప్లేట్ తో ఇండియన్ ప్లేట్ ఢీకొన్ని ప్రాంతాల్లో ఈ భూకంపాలు వస్తాయి.

  2. ఇంట్రాప్లేట్ భూకంపాలు: ఒకే టెక్టోనిక్ ప్లేట్ లో సంభవిస్తాయి. వీటి తీవ్రత తక్కువ.

  3. నిస్సార భూకంపాలు: ఈ భూకంపాలు సాధారణంగా 70 కిలోమీటర్ల కంటే తక్కువ లోతులో సంభవిస్తాయి. వీటి వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.

  4. లోతైన భూకంపాలు: ఈ భూకంపాలు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులే సంభవిస్తాయి. ఈ భూకంపాలు చాలా వరకు నిస్సార భూకంపాల కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. ఒక్కోసారి ఇవి చేసే నష్టం చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు.


భారత్ లో సంభవించిన అతిపెద్ద భూకంపాలు..



  • కచ్ భూకంపం(1819) - 8.3 తీవ్రత 

  • అస్సాం భూకంపం(1897)

  • బీహార్- నేపాల్ భూకంపం(1934) - 8.4 తీవ్రత

  • కోయినా భూకంపం(1967) - 6.5

  • ఉత్తరకాశీ(1991) - 6.6 తీవ్రత

  • కిల్లారి(1993) - 6.4 తీవ్రత

  • భుజ్(2001) - 7.7తీవ్రత

  • జమ్మూకశ్మీర్ (2005)