Twitter Deal:


మీటింగ్‌లో సరే అన్నారట..


ట్విటర్‌ను కొనుగోలు చేసే విషయమై...ఎలన్‌ మస్క్‌, షేర్ హోల్డర్‌ల మధ్య వాదన నడుస్తూనే ఉంది. చాన్నాళ్లుగా ఈ అంశం నలుగుతూనే ఉంది. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనాలని మస్క్ ఎప్పటి నుంచో మొండి పట్టుతో ఉన్నారు. ఎడిట్ ఆప్షన్ అంటూ ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేపారు. ఈ డీల్‌ ఇక క్లోజ్ అవుతుందేమో అనుకుంటున్న తరుణంలో...కొత్త అప్‌డేట్ వచ్చింది. ఎలన్ మస్క్ డీల్‌కు ట్విటర్ షేర్ హోల్డర్స్‌ ఓకే చెప్పారు. ఎలన్ మస్క్ చేసిన 44 బిలియన్ డాలర్ల ఆఫర్‌కు ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ను విక్రయించడానికి షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపినట్టు ప్రాథమికంగా ట్విటర్ తెలిపింది. ఈ ప్రకటన రాకముందు...ట్విటర్ షేర్ హోల్డర్స్‌ సమావేశమయ్యారు. అయితే...ఈ భేటీ కాసేపు మాత్రమే జరిగిందట. ఈ సమయంలోనే...ఎలన్ మస్క్‌ ట్విటర్ డీల్‌పై ప్రస్తావన వచ్చిందని సమాచారం. ఈ డీల్‌కు సానుకూలంగా స్పందించారంతా. ఆన్‌లైన్‌లో ఓటు కూడా వేశారు. ఈ ఓటింగ్‌లో ఎక్కువ మంది షేర్ హోల్డర్స్‌ మస్క్ డీల్‌కి ఓకే చెప్పారు. దీని తరవాతే...ట్విటర్ ప్రకటన చేసింది. విచిత్రం ఏంటంటే.. ట్విటర్‌ను కొనుగోలు చేసే విషయంలో మస్క్ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి టైమ్‌లో...ట్విటర్ చేసిన ప్రకటన అంతటా చర్చకు దారి తీసింది. 






బయటకు వస్తే..? 


అగ్రిమెంట్ ప్రకారం ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయని పక్షంలో 1 బిలియన్ డాలర్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఎలన్ మస్క్ పెనాల్టీ చెల్లిస్తారో లేదా లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు ఆయనకు మరేదైనా దారి ఉందో తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడక తప్పదు. ఇప్పటివరకైతే ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేయటంపై ఎలన్ మస్క్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ స్పామ్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉంటేనే ట్విట్టర్ కొనుగోలు చేస్తానని మస్క్ గతంలోనే తెలిపారు. అందుకు భిన్నంగా స్పామ్ ఖాతాలు 15 నుంచి 20 శాతం ఉన్నట్లు గుర్తించిన ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డీల్‌ను రద్దు చేసుకున్నారు. ట్విట్టర్ తమకు పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, తప్పుడు సమాచారం సైతం అందించిందని ఎలన్ మస్క్‌ తరఫు న్యాయవాదులు యూఎస్‌ సెక్యూరిటీస్‌, ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు లేఖ సమర్పించారు. అంతకు ముందు...మస్క్ ఓ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ఈ డీల్ అంతా పూర్తై..తన అధీనంలోకి ట్విటర్ వస్తే..యూజర్లు రుసుము చెల్లించాల్సి రావొచ్చని ఎలన్ మస్క్ ప్రకటించారు.  సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన అవుననే చెప్పారు. అయితే అందరి యూజర్ల నుంచి కాదని, వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు మాత్రం స్వల్ప మొత్తంలో రుసుము చెల్లించాల్సి రావొచ్చు అని తెలిపారు. 


Also Read: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం కేసులో షోరూం నిర్వాహకులు సహా నలుగురు అరెస్టు


Also Read: Queen Elizabeth II | ఆ మూడు దేశాలకు అందని క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల ఆహ్వానం| ABP Desam