Samosa: హిమాచల్ ప్రదేశ్‌లో సమోసా దొంగలపై విచారణలు - హమ్మ సీఎం కోసం తెచ్చినవే తినేస్తారా?

Himacal Pradesh: హిమచల్ ప్రదేశ్‌లో సీఎం కోసం తెచ్చిన సమోసాలు మిస్ అయ్యాయి. వాటిని ఎవరు తినేశారో సీఐడీ విచారణకు ఆదేశించారు. దీనిపై బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.

Continues below advertisement

Himachal govt over CID probe on samosa Missing: రాజకీయాల్లో చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మామూలుగానే ఉంటాయి కానీ జరిగే ప్రచారం మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయంగా హైలెట్ అవుతోంది. అధికర పక్షాన్ని విపక్షం టార్గెట్ చేస్తోంది. దీనంతటికి కారణం ఓ సమోసా.  

Continues below advertisement

సీఎం కార్యక్రమం కోసం సమోసాలు  ఆర్డర్ చేసిన అధికారులు                  

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి సుఖు ఇటీవల పోలీసులకు సంంబధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఐడీ అదికారులు ఆ కార్యక్రమాన్ని   హోస్ట్ చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తోంది. అయితే టీ స్నాక్స్.. మాత్రం బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. ఇలా ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి స్నాక్స్ ను కాస్త లగ్జరీ హోటల్ నుంచి తెప్పించాలని సీఐడీ అధికారులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సిమ్లాలోని ఓ పేరొందిన హోటల్ నుంచి  సమోసాలు... ఇతర తినుబండారాలు ఆర్డర్ చేశారు.                 

ఇలాంటి ఒక్క బోర్డు షాప్‌ ముందు పెడితే ..జెప్టోలు గిఫ్టోలు మూసేసుకోవాల్సిందే! ఈ వ్యాపారి తెలివి మాత్రం సూపర్

సీఎం దాకా రాకుండానే మధ్యలో మాయం అయిన సమోసాలు                              

ముఖ్యమంత్రి సమీక్ష చేసేటప్పుడు మధ్య మధ్యలో తినేలా వాటి ని అందించాలని అనుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చారు.. సమీక్ష చేసి వెళ్లారు. కానీ సీఐడీ అదికారులు మాత్రం తాము అనుకున్న విధంగా సమోసాలు ఇతర పదార్థాలు సీఎం ముందు పెట్టలేకపోయారు. దీంతో సీఐడీ అధికారులకు కోపం వచ్చింది. సమోసాలన్నీ ఏమైపోయాయో ఆరా తీశారు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. ఇదేదో తెడాగా ఉందని అంతర్గత విచారణకు ఆదేశించారు.               

టీవీ చూడనివ్వకపోవడం, కింద పడుకోమని చెప్పడం గృహహింస కాదు - కీలక తీర్పు ఇచ్చిన ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్

సీఎం భద్రతా సిబ్బంది తిన్నారని విచారణలో వెలుగులోకి                             

అంతర్గత విచారణలో ఆ సమోసాలు సీఎం వరకూ రాలేదని.. ఆయన భద్రతా సిబ్బంది కోసం అనుకుని వారికి సర్వ్ చేయడంతో అయిపోయినట్లుగా గుర్తించారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇలా ఆదేశించిన విషయం .. విచారణ చేయించిన విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ నేతలు మరింత ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం ప్రస్తావన లేకపోయినా ఆయన పేరును తీసుకు వచ్చి .. విమర్శలు గుప్పిస్తున్నారు. అదే  రాజకీయం అనుకోవాలేమో ?

Continues below advertisement
Sponsored Links by Taboola