Making daughter in law sleep on carpet prohibiting TV not cruelty High Court: కోడలిని ఒంటరిగా గుడికి వెళ్లేందుకు అనుమతించకపోవడం, కార్పెట్‌పై నిద్రించాలని చెప్పడం, టీవీ చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడం గృహ హింసకు రాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఇరవై ఏళ్ల నాటి ఓ కేసులో కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అత్త, మామలతో పాటు భర్తకు దిగువ కోర్టు గృహహింస చట్టం శిక్ష విధించింది. పెళ్లి బంధంతో ఇంటికి వచ్చిన కోడలిపై వారు కర్కశంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. మానసికంగా వేధించారని అనుమానిస్తూ ఒంటరిగా బయటుకు వెళ్లనీయకపోవడం, టీవీ చూడటానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం.. అలాగే కార్పెట్ మీద పడుకునేలా చేయడంతో మానసికంగా నలికిన యువత ప్రాణాలు తీసుకుంది.
అప్పట్లో ఈ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది. దిగువ కోర్టు విచారణ జరిపి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారని గృహ హింస చట్టం ప్రకారం శిక్షార్హులేనని తేల్చింది. వారందిరకి జైలు శిక్షలు విధించింది. వీరు ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిగిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు గృహ హింస కిందకు రావని అభిప్రాయపడ్డారు. టీవీ చూడనినివ్కపోవడం.. కింద పడుకోమని చెప్పడం లాంటివి ఇళ్లల్లో జరిగే కామన్ విషయాలని ఇలాంటి వాటి ని గృహ హింసగా భావించి శిక్షించలేమని స్పష్టం చేసింది. కేసు నుంచి వారికి విముక్తి కలిగిస్తూ తీర్పు చెప్పింది.
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళ ఆత్మహత్య చేసుకున్న గ్రామంలోని కొంత మంది ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం కూడా ఇంట్లో పనులు చేయమనడం గృహ హింస కాదని హైకోర్టు స్పష్టం చేసంది. అర్థరాత్రి తర్వాత వచ్చే మున్సిపల్ వాటర్ ను పట్టుకోవడం కోసం ఒకటిన్న వరకు మేలుకుని ఉండమని చెప్పడం. చెత్తబండి వచ్చినప్పుడు చెత్తను ఇచ్చి రావాలని చెప్పడం కూడా గృహ సింహ కాదని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ బెంచ్ తీర్పుతో జైలు శిక్ష ఎదుర్కొంటున్న వారికి రిలీఫ్ కలిగింది. వారు లాంచనాలు పూర్తి బయటకు రానున్నారు.
దేశంలో గృహ హింస చట్టం అత్యంత కీలకమైనది. అయితే గృహ హింస విషయంలో కోర్టులు అనేక రకాల తీర్పులు ఇస్తున్నాయి. శారీరకంగానే కాదు మానసికంగా హింసించడం కూడా గృహ హింసేనని కొన్ని కోర్టులు తీర్పు ఇచ్చాయి. మరికొన్ని కోర్టులు భిన్నంగా తీర్పులు ఇచ్చాయి.