Bengaluru vendor challenges Blinkit  Zepto  BigBasket with unique ad: పోటీ ప్రపంచంలో ఎంత వినూత్నంగా ఆలోచిస్తే అంత గొప్పగా నిలదొక్కుకుంటారు. లేకపోతే ఒకరిని మరొకరు మింగేసే వ్యాపారాలు వచ్చేస్తున్నాయి. మనకు ప్రతి వీధిలోనూ చిల్లర దుకాణం ఉటుంది. గతంలో మనకు ఏం కావాల్సినా అక్కడికి వెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మన సగం సగం.. .జెప్టో, బ్లింక్ ఇట్, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ అంటూ  యాప్‌లు ఓపెన్ చేసి ఆర్డర్స్ పెట్టేస్తున్నారు. ధరలు ఎంత ఉన్నా సరే.. ఏదో ఓ కూపన్‌తో డిస్కౌంట్ వస్తుంది కదా అని దానికే ఫిక్సయిపోతున్నారు. అదుకే చిన్న వ్యాపారులకు గడ్డు కాలం ఎదురవుతోంది.
 
స్టార్టప్‌లకు పుట్టినిల్లు లాంటి బెంగళూరులోనూ వ్యాపారులకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. అక్కడ ప్రతి వ్యాపారానికి ఓ ఆన్ లైన్ డెలివరీ యాప్ వచ్చేసింది. అక్కడ వ్యాపారాలు ఇంకా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోగాత్మకంగా ముందు  బెంగళూరులోనే సేవలు అందిస్తున్నారు.  ప్రతి విషయంలోనూ పోటీ పడి డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. ఆ ఆన్ లైన్ వ్యాపార సంస్థలన్నింటికీ చెక్ పెట్టేలా ఒకే ఒక్క బోర్డు తయారు చేశాడు. ఆ బోర్డును తన దుకాణం ముందు పెట్టాడు. అంతే దెబ్బకు వైరల్  అయిపోయింది. 


 


ఆ బోర్డులో తనకు తెలిసిన సాహిత్యం రాయలేదు. కొటేషన్లు రాయలేదు. జస్ట్..  జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్‌లలో తాను అమ్మే వస్తువు ధరలు ఎలా ఉన్నాయి.. తాను ఎంతకు అమ్ముతన్నానో బ్లాక్ బోర్డు మీద డిస్‌ప్లే చేశాడు అంతే. కొబ్బరి కాయలు అమ్మే వ్యక్తి కి ఆలోచన వచ్చింది. ఎప్పుడూ వచ్చే కస్టమర్లు కూడా రాకపోతూండటంతో ఏం జరిగిందా అని ఆరా తీశాడు. యాప్‌లతో డెలివీర చేయిచుకుటున్నారని తెలియడం... ఆయా యాప్‌లలో తక్కువ ధరకే వస్తుున్నాయని కొంత మంది చెప్పడంతో దాని సంగతేమిటో చూడాలనుకున్నాడు. తీరా చూస్తే.. తాను అమ్మే దాని కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. 



విషయాన్ని గుర్తించి.. వారందరికీ ఈ విషయం చెప్పలేదు. తానే ఓ బోర్డు తీసుకుని ఆ రోజు కోకనట్ ధర ఆయా యాప్‌లలో ఎంతకు అమ్ముతున్నారో.. తాను ఎంతకు అమ్ముతున్నానో రేట్లు డిస్ ప్లే చేశారు.ఆయన క్రియేటివిటికీ అందరూ పిదా అయ్యారు. చిరు వ్యాపారులంతా ఇదే టెక్నిక్‌ను ఫాలో అయి తమ దుకాణంలో ఉన్న వస్తువులు.. ఆన్ లైన్‌లో ఉన్న  వస్తువుల ధరలు పోల్చుతూ బోర్డులు పెడితే ఇక చిన్న దుకాణాలకు పూర్వ వైభవం వస్తుందని కొంత మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.