Telugu News Today: ఇవే చివరి ఎన్నికలు అంటున్న వైసీపీ నేతలు.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..!
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధికార వైసిపి అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వార్ డిక్లేర్ చేస్తే.. వై నాట్ పులివెందుల(Pulivendula) అంటూ తెలుగుదేశం(Telugu Desam ) పార్టీ జనసేన(Janasena ) కూడా యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గేర్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసిపి ముఖ్య నేతలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూనే.. మరోవైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో 2 వందే భారత్ ట్రైన్స్‌ ప్రారంభించిన మోదీ
పూరీ నుంచి విశాఖ(Visakhapatnam), సికింద్రాబాద్‌ నుంచి విశాఖ మధ్య వందేభారత్‌ (Vandebharat)పరుగులు మొదలయ్యాయి. అహ్మదాబాద్(Ahmedabad) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రెండు సహా మొత్తం 10 కొత్త హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చాయని దేశాభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైదరాబాద్‌ రోడ్లపైకి 22 ఎలక్ట్రిక్ బస్సులు- ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. రోడ్డు ట్రాన్స్ పోర్టు సంస్థ కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో 5వందల బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ భేటీ - కాంగ్రెస్ పార్టీలో చేరే చాన్స్
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్  గైర్హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ మొదలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


యాదాద్రి ఆలయ ఘటనపై భట్టి విక్రమార్క అనూహ్య స్పందన - అవమానం నిజమేనా ?
యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై  మండిపడ్డారు.  తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని అన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి