Vande Bharat Trains: పూరీ(Puri) నుంచి విశాఖ(Visakhapatnam), సికింద్రాబాద్(Secunderabad) నుంచి విశాఖ(Visakhapatnam) మధ్య వందేభారత్ (Vandebharat)పరుగులు మొదలయ్యాయి. అహ్మదాబాద్(Ahmedabad) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రెండు సహా మొత్తం 10 కొత్త హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చాయని దేశాభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు భారతీయ రైల్వే వ్యవస్థే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. దానికి భిన్నంగా పాలన చేస్తున్నట్టు వివరించారు.
పలు రైల్వే ప్రాజెక్టు, వందేభారత్ ట్రైన్స్ నేటి యువత ఉజ్వల భవిష్యత్తుకు భరోసా అని అన్నారు ప్రధానమంత్రి మోదీ. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పని రైల్వేను ప్రభుత్వ బడ్జెట్‌లో చేర్చడం. దీని వల్ల ఇప్పుడు ప్రభుత్వ నిధులు రైల్వే అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు.
10 కొత్త రైళ్లలో రెండు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో ఏపీ నుంచి వడిచే వందేభారత్ రైళ్లు మూడుకు చేరుకుంది. కొత్త రైళ్లు పూరీ-విశాఖ, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తున్నాయి.
మీడియాతో మాట్లాడిన డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ "విశాఖపట్నం మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి పూరీ-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మరొకటి సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూరీ-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. "
విశాఖపట్నం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రెండు కొత్త రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటు వన్ స్టేషన్ వన్ ప్రోడెక్ట్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సహా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
2010లో ఢిల్లీ నుంచి వారణాసి వరకు మొదటి వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం 41 రైళ్లు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.