Telangana News Today | మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీ జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన మంచు మనోజ్‌ తన అన్నపై పరోక్షంగా మండిపడ్డారు. తాను ప్రేమించిన పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం, బంధువుల కోసం నిలబడినందుకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో పూర్తిగా చెప్పాల్సిన టైం వచ్చిందని సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని కూలంకుషంగా చెప్పేస్తానని అన్నారు. పూర్తి వివరాలు


విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మకంగా సంస్థ రానుంది. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరున్న గూగుల్‌ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గూగుల్ ఇటీవల తెలంగాణలో సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దేశంలో ఇది తొలి సెక్యూరిటీ సెంటర్ కాగా, ఏసియాలో రెండోది అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు


ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై మంచు మోహన్‌ బాబు చేసిన దాడి సంచలనంగా మారుతోంది. దీనిపై ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు స్పందించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘర్షణలో మోహన్ బాబుకి కూడా గాయాలు అయినట్టు విష్ణు తెలిపారు. అందుకే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. మోహన్ బాబును పరామర్శించిన నటుడు విష్ణు అక్కడే విలేకర్లతో మాట్లాడారు. పూర్తి వివరాలు


2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 సంవత్సరంలో గూగుల్ సెర్చ్‌లో భారతీయులు ఎక్కువ వెతికిన అంశాలను ఆ సంస్థ ప్రకటించింది. ఎప్పటి మాదిరిగానే క్రికెట్‌ సంబంధించిన అంశాలు టాప్‌లో ఉంటే తర్వాత స్థానం సినిమాలదే. తెలుగు రాష్ట్రాలతో లింక్ ఉన్న టాపిక్స్ కూడా ఈ గూగుల్‌ సెర్చ్‌లో ఉన్నాయి. ఫేమస్ అయిన వ్యక్తులు గురించి కూడా గూగుల్‌లో వెతికారు. వారిలో వినేష్‌ ఫొగాట్‌ మొదటి స్థానంలో ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాలు 


వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. పేర్ని నాని సతీమణి పేరుపై ఉన్న  గోడౌన్లలో పౌరసరఫరాల శాఖ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. అయితే ఆ బియ్యం మాయమైంది. ఏమయిందో ఎవరికీ తెలియలేదు. బియ్యం పోయాయని కావాలంటే డబ్బులు ఇస్తామని పేర్ని నాని అధికారులకు లేఖ రాశారు. పూర్తి వివరాలు