7/G Tamil Movie On Aha: ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఓ హారర్ చిత్రం తెలుగు వెర్షన్  ఓటీటీలోకి రానుంది. హారర్ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి డిమాండ్ ఉంది. కానీ సరిగ్గా తీస్తేనే క్లిక్ అవుతాయి. ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలు అంతగా విజయం సాధించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది తమిళంలో రూపొందిన ‘డిమాంటె కాలనీ 2’ మాత్రమే హిట్ అయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా కలెక్షన్లు బాగానే రాబట్టింది.


7G The Dark Story OTT Release Date Telugu: సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘7/G’ తమిళ సినిమా విడుదల తెలుగులో కావడానికి సిద్ధంగా ఉంది. హారూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆహా తెలుగులో మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. అప్పట్లో విడుదలైన ‘7/జి బృందావన కాలనీ’ సినిమాకు ఈ తాజా ‘7/G’ కు ఎటువంటి లింక్ లేదు.






అపార్ట్ మెంట్ లో ఏం జరిగిందంటే...


కథలోకి వెళితే, కొత్తగా ఫ్లాట్ లోకి దిగిన భార్యభర్తలకు ఎదురయ్యే భయానక ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. స్మృతి వెంకట్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హారున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింద. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, కథాకథనాల్లో దర్శకుడు హారూన్ శ్రద్ధ పెట్టలేదని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. ‘కాదల్ కొండెన్’ (తెలుగు లో అల్లరి నరేశ్ ‘నేను’), ‘పుదుపెట్టై’,  ‘7/జి బృందావన కాలనీ’ సినిమాలు హీరోయిన్ సోనియా అగర్వాల్ కెరీర్ ను ఓ స్థాయిలో నిలిపాయి. ‘7/జి రెయిన్ బో కాలనీ’ ‘పుదుపెట్టై’ సినిమాల్లో నటనకు గానూ ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డులనూ అందుకున్నారు. ‘7/జి రెయిన్ బో కాలనీ’ తెలుగు వెర్షన్, ‘7/జి బృందావన కాలనీ’ కూడా సూపర్ హిట్ అయింది.  తర్వాతి కాలంలో దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి విడిపోయిందీ జంట. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సోనియా అగర్వాల్. రీ ఎంట్రీ తర్వాత సోనియా అగర్వాల్ కెరీర్ సజావుగా సాగలేదు. చాన్నాళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాలో ఓ కీలక రోల్ చేశారు. ‘టెంపర్’ తమిళ వెర్షన్ విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ లోనూ నటించారు. సాయిదుర్గ తేజ్ సినిమా ‘విన్నర్’ లో కూడా కనిపిస్తారు. ఇటీవలే ‘ష్....’ అనే తమిళ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ఆమె కథానాయికగా నటించిన ఓ మలయాళ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘7/G’ ఒరిజినల్ వెర్షన్ ఆహా తమిళ్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది.


Also Read: అన్ని అడ్డంకులూ, వివాదాలు దాటుకుని ఓటీటీలోకి వచ్చిన విక్రమ్ 'తంగలాన్'... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్