Chiranjeeva Web Series: ‘బలగం’ వేణు బాటలో ‘అదిరే’ అభి... ఆయన దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Chiranjeeva On AHA: ‘బలగం’ సినిమాతో జబర్దస్త్ కమెడియన్ వేణు తనలో ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారని నిరూపించారు. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ అభినయ్ కృష్ణ కూడా దర్శకునిగా మారారు.  

Continues below advertisement

Chiranjeeva Webseries on Aha Telugu: రెబల్ స్టార్ ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఓ కమెడియన్ ఉంటారు. అందరి హీరోలను అతను ఇమిటేట్ చేస్తూ నవ్వించే సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ నటుడే అభినయ్ కృష్ణ. చాలా సినిమాల్లో నటించారు. తర్వాతి కాలంలో జబర్దస్త్ టీవీ షో  కమెడియన్ ‘అదిరే’ అభిగా తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బలగం’ సినిమాతో జబర్దస్త్ కమెడియన్, నటుడు వేణు యల్దండి తనలో ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారని నిరూపించారు. త్వరలోనే నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే సినిమాకు వేణు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇప్పుడు అభినయ్ కృష్ణ కూడా దర్శకునిగా మారారు.

Continues below advertisement

హిట్ కాన్సెప్ట్ తో 'చిరంజీవా' వెబ్ సిరీస్
‘యముడితో ఆట’ ఆడితే ఎలా ఉంటుందో... సీనియర్ ఎన్టీఆర్ తన ‘యమగోల’ సినిమాలో చూపించారు. ‘యముడికి మొగుడు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా యముణ్ణి ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ‘యమదొంగ’లో అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో యముడి గెటప్ కూడా వేయించారు. అసలు, యముడు, చిత్రగుప్తుడు, యమభటులు.... ఇలా యమలోకం చుట్టూ కథలు అల్లి తెలుగు దర్శక రచయితలు సూపర్ హిట్ సినిమాలు అందించారు. కమెడియన్ అలీని కొన్నాళ్లు హీరోగా నిలబెట్టింది కూడా ‘యమలీల’ సినిమా. ఈ సినిమాల్లో హీరోలు యముణ్ణి లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకుంటారు. ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఇది.

Chiranjeeva Web Series On Aha Telugu OTT: యముడితో ఆట ఎలా ఉంటుందో మరోసారి చూపించబోతున్నారు ‘అదిరే’ అభి (Adhire Abhi). ఆయన దర్శకునిగా మారి, రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ‘చిరంజీవ’. ‘యముడితో ఆట’ అనేది ట్యాగ్ లైన్.  స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్, సుహాసిని ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆహా తెలుగులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రాజు అచ్చుమణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆహా తెలుగు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Continues below advertisement