Google Trending Topics 2024: 2024 సంవత్సరంలో గూగుల్ సెర్చ్‌లో భారతీయులు ఎక్కువ వెతికిన అంశాలను ఆ సంస్థ ప్రకటించింది. ఎప్పటి మాదిరిగానే క్రికెట్‌ సంబంధించిన అంశాలు టాప్‌లో ఉంటే తర్వాత స్థానం సినిమాలదే. తెలుగు రాష్ట్రాలతో లింక్ ఉన్న టాపిక్స్ కూడా ఈ గూగుల్‌ సెర్చ్‌లో ఉన్నాయి. 


నార్మల్‌గా గూగుల్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు 
గూగుల్‌లో ఎక్కువగా వెతికే అంశాల్లో స్పోర్ట్స్ రిలేటెడ్‌ మన దేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈసారి కూడా ఎక్కువ మంది ఐపీఎల్‌, టీ 20 వరల్డ్ కప్‌ గురించి వెతికారు. 1)ఐపీఎల్‌ 2) టీ20 వరల్డ్‌ కప్‌ 3) బీజేపీ 4) ఎలక్షన్ రిజల్ట్స్‌ 2024 5) ఒలింపిక్స్‌ 6) ఎక్సెసివ్‌ హీట్‌ 7) రతన్‌ టాటా 8) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 9) ప్రో కబడ్డీ లీగ్‌ 10) ఇండియన్‌ సూపర్‌ లీగ్‌  


గూగుల్ సెలబ్రెటీలు వీళ్లే 


ఫేమస్ అయిన వ్యక్తులు గురించి కూడా గూగుల్‌లో వెతికారు. అలా వతెకిన వారిలో వినేష్‌ ఫొగాట్‌ మొదటి స్థానంలో ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఐదు స్థానాల్లో నలుగురు కూడా రాజకీయ నాయకులే ఉన్నారు. ఈ ఏడాది ఈ ముగ్గురు సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు. అందుకే వీరి కోసం గూగుల్‌లో నెటిజన్లు వెతికారు. పూర్తి జాబితాను ఇక్కడ చూడొచ్చు. 1) వినేశ్‌ ఫొగాట్‌ 2) నీతీశ్‌ కుమార్‌ 3) చిరాగ్‌ పాసవాన్‌ 4) హార్దిక్‌ పాండ్యా 5) పవన్‌ కల్యాణ్‌ 6) శశాంక్‌ సింగ్‌ 7) పూనమ్‌ పాండే 8) రాధికా మర్చంట్‌ 9) అభిషేక్‌ శర్మ 10) లక్ష్య సేన్‌ 


ట్రెండింగ్ సినిమాలు ఇవే 


సినిమాల్లో ట్రెండింగ్ టాపిక్స్ గురించి చూస్తే టాప్‌ స్ట్రీ 2 సినిమా ఉంది. దాని సంచలనం సృష్టించిన కల్కి2898ఏడీ సినిమా ఉంది. మరో తెలుగు సినిమా సలార్‌ సినిమా కోసం కూడా నెటిజన్లు వెతికారు. 1) స్త్రీ- 2 2) కల్కి 2898 ఏడీ 3) 12 ఫెయిల్‌ 4) లా పతా లేడీస్‌ 5) హనుమాన్‌ 6) మహారాజా 7) మంజుమ్మెల్‌ బాయ్స్‌ 7) ద గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం 9) సలార్‌ 10) ఆవేశం 


ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన పవన్ కల్యాణ్


ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేసిన అంశాలను గమనిస్తే... కోపా అమెరికా, UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ICC మెన్‌ T20 వరల్డ్‌ కప్‌ గురించి ఎక్కువ మంది వెతికారు. రాజకీయాల విషయానికి వస్తే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన US ఎన్నికలతోపాటు హరికేన్ మిల్టన్ వంటి వాతావరణ విషయాల గురించి వెతికారు. ఒలింపిక్స్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.


ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇన్‌సైడ్ అవుట్ 2, డెడ్‌పూల్ & వుల్వరైన్ టాప్‌లో నిల్చున్నాయి. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్, కేథరీన్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ వంటి ప్రముఖ వ్యక్తుల గురించి కూడా గూగుల్‌లో శోధించారు. ఈ జాబితాలో ఇండియాలోనే కాకుండా వరల్డ్ జాబితాలో కూడా పవన్ కల్యాణ్ చోటు సంపాదించుకున్నారు. నటులు కేట్ విలియమ్స్, ఆడమ్ బ్రాడీ, ఎల్లా పర్నెల్, హీనా ఖాన్‌తోపాటు పవన్ గురించి కూడా నెటిజన్లు శోధించారు. 


Also Read: ఏపీకి మరో భారీ ప్రాజెక్టు, కొప్పర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని కేంద్ర నిర్ణయం