Telangana News Today - వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
విజయవాడ వరద బాధితులను కాపాడుకుని సాయం అందిస్తే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో వచ్చిన వరద సమయం నుంచి ఆపకుండా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మంత్రులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం ఏ అవసరానికి ఎంత ఖర్చు పెట్టారు.. ప్రభుత్వం మొత్తం 601 కోట్లు ఖర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జTop Headlines Today: వరద సాయంపై వైసీపీది దుష్ప్రచారమేనన్న ఏపీ మంత్రులు! భార్య అవినీతిపై హైదరాబాద్‌లో భర్త హోం టూర్ - నేటి టాప్ న్యూస్రుగుతుందని వైసీపీ నేతల్ని మంత్రులు ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దేశ రాజకీయాలకు కొంచెం భిన్నంగా, కాస్త ముందే ఉంటాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఘటలు చోటు చేసుకుంటాయి. ఇక్కడి నాయకులు సరికొత్త సంప్రదాయాలకు తెరతీస్తుంటారు. అక్కడ ఏం చేసినా ట్రెండ్ సెటర్‌గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి అంశం ఒకటి హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు రెడ్ బుక్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై భర్త హోం టూర్- హైదరాబాద్‌లో సంచలనం!
ఉద్యోగం అడ్డుపెట్టుకుని తన భార్య చేస్తున్న అక్రమాలను ఓ భర్త వెలుగులోకి తీసుకొచ్చాడు. అవినీతికి పాల్పుడుతున్న భార్య కోట్లు దోచుకుంటుందని తెలియజేస్తూ ఓ హోంటూర్ వీడియో సైతం చేశాడు. తమ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బుల కట్టలే ఉన్నాయని ఆరోపించిన వ్యక్తి చేసిన హోం టూర్ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. తన ఇంట్లోనే కాకుండా భార్య తన సోదరులకు కూడా భారీగా డబ్బు ఇస్తోందని.. వారి ఖాతాల్లో జమ చేస్తోందని వీడియోలో ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాపింగ్ చేయాలని ప్రభుత్వం వాహనదారులకు సూచిస్తోంది. స్వచ్ఛందంగా తమ వాహనాలను స్క్రాప్ చేపించే వారికి రాయితీలు ఇస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడువు తీరిన స్క్రాప్డ్ వాహనాలను గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సారథి, వాహన్ పోర్టల్‌లో చేరిన తెలంగాణ ప్రభుత్వం స్కాప్ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పండుగ నాడూ పప్పులు ఉడకట్లా - గవర్నమెంట్ వార్నింగ్‌తోనైనా ధరలు దిగొచ్చేనా?
ప్రతిరోజూ కంచంలో పప్పు లేనిదే కొన్ని కుటుంబాలకు గొంతు దిగదని తెలిసిందే. మాంసాహారులైనా, శాఖాహారులైనా అందరికీ పప్పు అంటే ఇష్టం. ప్రొటీన్లు మెండుగా ఉండే పప్పులు, మాంసాహారానికి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. మన భోజనంలో కీలక భాగమైన పప్పులు ఇప్పుడు ఉడికేలా కనిపించడం లేదు, రేట్లు మండిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే... హోల్‌సేల్ మార్కెట్‌లో పప్పుల ధరలు తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో మాత్రం దిగిరావడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి