TDP  On Flood Relief : విజయవాడ వరద బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుని  చివరి వరకూ సాయం అందిస్తే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేబినెట్ సబ్ కమిటీలోని  మంత్రులు మండిపడ్డారు. వరద సాయం విషయంలో ఆపకుండా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం ఏ అవసరానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా వివరించారు.  ప్ర‌భుత్వం మొత్తం 601 కోట్లు ఖ‌ర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జ‌రుగుతుందని  మంత్రి నారాయణ ప్రశ్నించారు.  ఏదో ఒక‌సారి వ‌చ్చి చూసి వెళ్లిన జ‌గ‌న్ కు వాస్త‌వాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.


స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నీళ్ల‌లో తిరిగారు..మునిగిన ఇళ్ల‌కు వెళ్లారు..స్వ‌యంగా ప‌రిక‌రాలు డ్యామేజిని ప‌రిశీలించారని..  చంద్ర‌బాబు ప్ర‌తి చిన్న విష‌యాన్ని ప‌రిశీలించి సాయం చేశారని మంత్రి గుర్తు చేశారు.  ప‌త్రిక ఉంద‌ని కోట్లు కొట్టేసార‌ని నోటికొచ్చిన‌ట్లు రాస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు జిల్లా నిధుల నుంచి ఖ‌ర్చు పెట్టారన్నారు.  విశాఖ హుద్ హుద్ తుపానుకు విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌కు చాలా తేడా ఉందని..  విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో కొన్ని చోట్ల నాలుగు రోజులు జ‌నం నీటిలోనే ఉండాల్సి వ‌చ్చిందని గుర్తు చేశారు.  విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో 30 ల‌క్ష‌ల వాట‌ర్ ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా చేశామన్నారు. ప్ర‌జ‌ల‌కు నీరు లేక‌పోవ‌డంతో మేం స‌ర‌ఫ‌రా చేసిన వాట‌ర్ బాటిల్స్ ను టాయిలెట్స్ కు కూడా ఉప‌యోగించుకున్నారని గుర్తు చేశారు.


బాధితుల‌కు అవ‌స‌ర‌మైన భోజ‌నాన్ని అప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర జిల్లాల నుంచి తెప్పించామని..  పేప‌ర్ ఉంది క‌దా అని నోటికొచ్చిన‌ట్లు రాస్తే జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరన్నారు.  విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో చంద్ర‌బాబు చేసిన సాయాన్ని ప్ర‌జ‌లంతా మెచ్చుకుంటున్నారు. వ‌ర‌ద‌ల్లో ప‌దివేల మంది మున్సిప‌ల్ సిబ్బంది రాత్రీ ప‌గ‌లు ప‌నిచేసారు. ఇత‌ర జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఇళ్ల‌ను శుభ్రం చేయించామని నారాయణ ెలిపారు.  ఇళ్లు నీట మునిగిన వారికి మా ప్ర‌భుత్వం 25 వేలు ఇస్తే జ‌గ‌న్ రెండు వేలు,నాలుగు వేలు ఇచ్చాడని..  వ‌ర‌ద బాధితుల‌కు 4 ల‌క్ష‌ల 6 వేల కుటుంబాల‌కు 601 కోట్లు ప‌రిహారం అందించామన్నారు.  విజ‌య‌వాడ లో నాలుగు వార్డుల్లో 15 రోజుల పాటు వ‌ర‌ద ఉంది. జ‌గ‌న్ ఇలానే చేస్తే రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా రాదని..  చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా సున్నా మిగులుతుందని మంత్రి నారాయణ హె్చచరించారు.


వరద సాయంపై చర్చకు రావాలని హోం మంత్రి అనిత  మాజీ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారాకు హద్దే ఉండటం లేదని ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశామని తెలిపారు. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు అయితే అంతకు మించిన అవినీతి ఎలా జరుగుతుందని ప్రశఅనించారు.  కలెక్టరేట్లో మకాం వేసి రాష్ట్రంలో ఉన్న వరద ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించి…. వార్డులకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారన్నారు.ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ల  ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారని  మండిపడ్డారు. ఎగ్ పఫ్ లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదని మా ప్రభుత్వంలో ప్రజల కోసమే ఖర్చు పెడతామని స్పష్టం చేశారు.