Telangana News Today on 10 December 2024 | ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌లు అందుకుంటున్న అనర్హులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లో సర్వే చేస్తోంది. పింఛన్ కోసం అడ్డుదారుల్లో తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టి నిజమైన అర్హులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. ఏపీలో వైక్యల్యం ఉన్న వారికి 15 వేల రూపాయలు పింఛన్ అందిస్తోంది ప్రభుత్వం. అందుకే ఇందులో ఇప్పటి వరకు ఉన్న అనర్హులను తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. పూర్తి వివరాలు
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకోనున్నారు. ఆయన్ని రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశిస్తే... లేదు మంత్రివర్గంలోకి తీసుకుందామని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీగా ఇచ్చిన మంత్రిని చేయనున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో మాత్రం తెలియడం లేదు. పూర్తి వివరాలు
'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఉన్న అవాంతరం తొలగిపోయింది. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు 16, 17 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీరింగ్ (RRB JE) 16, 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. గ్రూప్-2 పరీక్షల వాయిదా కోరుతూ.. కొందమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. పూర్తి వివరాలు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టారన్న కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన కేసుల్లో ఆర్జీవీకి ఊరట లభించింది. షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు వైసీపీకి అనుకూలంగా ట్వీట్ చేసిన రామ్‌గోపాల్ వర్మ... టీడీపీని చంద్రబాబును, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శలు చేశారు. పూర్తి వివరాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి- సిర్పూర్ ప్రజల్లో వణకు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. సిర్పూర్ మండలంలోని హుడుకిలిలో ఆవు దూడపై దాడి చేసింది. రైతు దంద్రె రావుజీ తన ఇంటి వద్ద కట్టేసి ఉంచిన దూడపై మంగళవారం వేకువజామున పులిదాడి చేసింది. అరుపులు విన్న స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. పులి వెళ్లిపోయిందని స్పాట్‌కు వచ్చిన చూస్తే లేగదూడ తీవ్ర గాయాలతో పడి ఉంది. పూర్తి వివరాలు