దేశంలో ఇన్ని జీవనదులున్నా తాగేందుకు నీళ్లుండవా? - సీఎం కేసీఆర్


దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్అన్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని, పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జబిందా గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పలువు మరాఠా నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగు, సాగు నీరు సమస్య ఎందుకు వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. నీరు అందించని పాపం ఎవరిదని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఇంకా చదవండి


చంద్రబాబు టూర్..


గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతల‌ మధ్య నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన జరగనుంది. అటు పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీటింగ్ లో ప్రస్తావించనున్నారు చంద్రబాబు. ఇంకా చదవండి


షర్మిలకు 14 రోజుల రిమాండ్


పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కోర్టు రిమాండ్  విధించింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ షర్మిలకు  14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. మే 8వ తేదీ వరకు షర్మిల జ్యూడీషియల్ రిమాండ్ కొనసాగుతుంది. అంతకుముందు సోమవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని పోలీసులు చెప్పారు. మరో పోలీస్ ను వాహనంతో ఢీకొట్టి గాయపరిచి, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మేజిస్ట్రేట్ కు వివరించారు. ఇంకా చదవండి


రూ.10 వేలు సాయం, ప్రకటనకే పరిమితం: ఈటల రాజేందర్


అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మాటలు తప్ప చేతలు లేవు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి. అధికారులకు సంపూర్ణ అధికారాలు ఇచ్చి ఖచ్చితమైన నష్టాన్ని అంచనా వేయాలి. బీజేపీ వచ్చాక విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతుకి అండగా ఉంటాం అన్నారు. ఇంకా చదవండి


నేడు ఏపీలో ఈ ఏరియాల్లో భారీ వర్షాలు - తెలంగాణకూ చల్లటి కబురు చెప్పిన ఐఎండీ


ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి సెంట్రల్ మధ్యప్రదేశ్ లోని ఆవర్తనం నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక  మీదగా ఇంటీరియర్ తమిళనాడు & పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.  రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇంకా చదవండి


తెలంగాణ‌లోని హిందువులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి- సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి


తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం చేవెళ్లలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించారు. దీనిపై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.  వెనుకబడిన ముస్లింలను చేరదీయాలన్న‌ ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష‌కు వ్య‌తిరేకంగా అమిత్ షా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. అయితే ఈ రెండు పార్టీలు ప్ర‌జ‌ల్లో మ‌తప‌ర‌మైన భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నాయ‌ని సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఎం.నాగేశ్వ‌ర‌రావు ఆరోపించారు. అలాంటి హామీల ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఇంకా చదవండి


మీరు కూడా RAW ‘ఏజెంట్’ కావచ్చు, చశాలరీ ఎంతో తెలుసా?


ప్రస్తుతం RAW ఏజెంట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తున్నాయి. మన టాలీవుడ్ హీరోలు సైతం గూఢచారులుగా, నిఘా ఏజెంట్ లుగా, సెక్యూరిటీ కమాండోలుగా అలరిస్తున్నారు. అసలు ఏజెంట్స్ అంటే ఎవరు? వారికి కావాల్సిన ఎలిజిబిలిటేస్ ఏంటి? స్పై నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలేంటే ఇప్పుడు చూద్దాం. ఇంకా చదవండి


మన పార్టీపై కుట్రలు, దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తుల కుట్రలు: పవన్ కళ్యాణ్ లేఖ


జనసేన పార్టీపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమ దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్న సమాచారం ఉందని తెలిపారు. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీవ్ర ఆర్థిక నేరాలు, ఆరోపణలపై మాట్లాడాల్సిన పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులు ఉద్దేశించి బహిరంగ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఈ తరుణంలో మన పార్టీ దృష్టిని మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని కుట్రపూరితు శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చరించారు. ఈ మేరకు లేఖ విడుదల చేసి జాగ్రత్తలు చెప్పారు. ఇంకా చదవండి


‘విరూపాక్ష’ సీక్వెల్ పై సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడతో సాయి ధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ‘విరూపాక్ష’ సీక్వెల్ పై జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోందని హీరో కన్ఫార్మ్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చదవండి


స్వల్ప లక్ష్యం ముందు చతికిలబడ్డ సన్‌రైజర్స్ - ఢిల్లీకి వరుసగా రెండో విజయం!


ఐపీఎల్‌ 2023 సీజన్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకు పరిమితం అయింది. దీంతో ఢిల్లీకి టోర్నీలో వరుసగా రెండో విజయం దక్కింది. సన్‌రైజర్స్‌కు మాత్రం వరుసగా మూడో ఓటమి. ఇంకా చదవండి