ఏప్రిల్ 25 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ మాటలో సున్నితత్వాన్ని కొనసాగించండి...మాటతూలితే మనస్పర్థలకు అవకాశం ఉంటుంది..జాగ్రత్తపడండి. రచయితలు, కళాకారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఈ రోజు ఏదో విషయంలో ఏమోషనల్ గా ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మధ్యాహ్నం తర్వాత మీరు ఏదో ఒక విషయంలో గందరగోళానికి గురవుతారు. తొందరపడి ఓ అవకాశాన్ని వదులుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. స్నేహితలను కలుస్తారు.
మిథున రాశి
ఈ రోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో గొడవలు రావొచ్చు.ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. అస్వస్థతకు గరయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళనను అనుభవిస్తారు. మధ్యాహ్నం తర్వాత మీరు పనిపట్ల ఉత్సాహం చూపిస్తారు. కుటుంబ వాతావరణంలో కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!
కర్కాటక రాశి
ఈ రోజు వ్యాపార రంగాల్లో ఉండేవారు లాభపడతారు. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. మానసిక మరియు శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం తర్వాత మీ మనస్సులో అనేక రకాల ఆందోళనలు తలెత్తుతాయి, ఇది కుటుంబ వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఈ సమయంలో, మీరు సహనంతో పని చేయాలి. ఏకాంతంగా ఉండాలి అనుకుంటారు. సాయంత్రం ప్రారంభమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.
సింహ రాశి
సింహ రాశివారికి ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో మంచి సమయం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది
కన్యా రాశి
కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. ఆఫీసు లేదా వ్యాపార స్థలంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు ఈరోజు సానుకూల ప్రయత్నాలు చేయవచ్చు. మధ్యాహ్నం తర్వాత కొత్త పని లేదా లక్ష్యాన్ని కనుగొంటారు. అసంపూర్తిగా ఉన్న ఏదైనా పని ఈరోజు పూర్తవుతుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు అనుకున్న పని పూర్తవదు..ఈ ప్రభావం మీపై రోజంతా ఉంటుంది. సోమరితనంగా అనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఆహారం తీసుకోపోవడం మంచిది. ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత దూరపు బంధువుతో సమావేశం కావచ్చు. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి భావాలను కూడా గౌరవించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు కుటుంబంలో ఆనందాన్ని అనుభవిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో లేదా వ్యాపార స్థలంలో కొత్త పనిని ప్రారంభించకపోవడమే మంచిది. యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీ పని పట్ల మీరు అసంతృప్తి చెందుతారు.
Also Read: మేషరాశిలో బుధుడు తిరోగమనం, 4 రాశులవారికి ఊహించనంత మంచి జరుగుతుంది!
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఏపనీ చేయాలని అనిపించదు. నూతన పెట్టుబడులకు ప్రణాళికలు వేసుకుంటారు. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రజలు మీ పని తీరును అభినందిస్తారు. కుటుంబంతో సమయం స్పెండ్ చేస్తారు. దంపతుల మధ్య బంధం బావుంటుంది. వ్యాపారం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
మకర రాశి
ఈ రాశివారు కష్టం కన్నా తక్కువ ఫలితం పొందుతారు. అయినా కష్టపడి పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అయితే, బయట తినడం మరియు త్రాగడం మానుకోండి. అసంపూర్తిగా ఉన్న పనిని మధ్యాహ్నం తర్వాత పూర్తి చేయవచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. సహోద్యోగులు మీకు సహకరిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో పనిని పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఆర్థిక వ్యవహారాలలో కూడా విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు లాభిస్తాయి. వాహనం లేదా ఇంటికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చేయండి. మనసులో ఏదో సంతోషం ఉంటుంది. మీరు ప్రతి పనిలో సంతృప్తి చెందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ఖర్చులు చేయొద్దు. డబ్బు ఆదాచేయడం నేర్చుకోవాలి.
మీన రాశి
ఈ రోజు మీలో నెలకొన్న ఆందోళనలు తగ్గుతాయి. సంతోషం, ఉత్సాహం పెరుగుతాయి. కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు లాభపడతారు. కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తన ఉంటుంది. మీరు ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. విశ్వాసం ఉంటే ఏ పని అయినా పూర్తిచేయగలగుతారు. తండ్రి వల్ల లాభపడే అవకాశం కూడా ఉంది. ఖర్చులు పెరుగుతాయి.