ఎన్నికల కమిషన్ సమావేశాలు 
ఇప్పటికే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన ఎన్నికల సంఘం రాష్ట్రాధికారులతో సమావేశమవుతోంది. అందులో భాగంగా ఎన్నికల సంఘం సీఈవో వికాస్‌ సింగ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ కమిషనర్లు, ఎస్పీలు, కలెక్టర్లతో సమావేశం కానున్నారు. 


ముగింపు వేడుక 
తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల స్మారక కోసం నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రాన్ని సీఎం నేడు ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏట అడుగు పెట్టిన సందర్భంగా ప్రారంభమైన దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు  పాల్గోననున్నారు. 


బోనాల సందడి 
తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవం మొదలుకానుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 


కేసీఆర్ టూర్
సంగా రెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల టౌన్‌షిప్‌ను ప్రారంభిస్తారు. వెలమెలలో ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పరిశీలిస్తారు. పటాన్‌ చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ చేస్తారు. 


జస్టిస్‌కు విందు 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీకే మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విందు ఇస్తోంది. సాయంత్రం ఏడు గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు గవర్నర్ అబ్దుల్ నజీర్‌, మంత్రులు పాల్గొంటారు. 


వర్చువల్ శంకుస్థాపన 
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా పలు సంస్థలు గ్రౌండ్ కానున్నాయి. వాటికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. 


క్రీడలపై సమీక్ష 
ఉదయం 11.30 నిమిషాలకు క్రీడాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణపై చర్చిస్తారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ 46 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ కార్లైల్ (Carlyle), ఇంటర్నెట్ లాజిస్టిక్స్ సంస్థ డెలివెరీ (Delhivery) నుంచి పూర్తిగా నిష్క్రమిస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం, బ్లాక్ డీల్ ద్వారా తన మొత్తం వాటాను ఆఫ్‌లోడ్ చేయబోతోంది.


మూలధన అవసరాల కోసం వేల కోట్ల రూపాయలను సమీకరించడానికి NTPC ప్లాన్‌ రెడీ చేసింది. రూ. 12,000 కోట్ల వరకు సేకరించడానికి, బాండ్ల జారీని పరిశీలించి, ఆమోదించడానికి ఈ నెల 24న NTPC డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతుంది.


TCS: నెస్ట్‌ (Nest) - TCS తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాయి. మెరుగైన మెంబర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి కాంట్రాక్ట్‌పై సంతకం చేశాయి. ప్రాథమికంగా, 10 సంవత్సరాల కాల గడువుతో ఉన్న ఈ కాంట్రాక్ట్ విలువ 840 మిలియన్‌ పౌండ్లు. 


కల్పతరు ప్రాజెక్ట్స్‌: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ. 300 కోట్ల విలువైన అన్‌ సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రిడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీకి కల్పతరు ప్రాజెక్ట్స్‌ (Kalpataru Projects) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


LTIMindtree: ఎల్‌టీఐమైండ్‌ట్రీ Canvas.aiని ప్రారంభించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను (AI) ఉపయోగించి, వ్యాపారానికి సంబంధించిన కాన్సెప్ట్-టు-వాల్యూ జర్నీని వేగవంతం చేయడానికి దీనిని రూపొందించింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: 2019లో, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ (ZEE Entertainment) సెటిల్‌మెంట్‌ చేసుకుంది. దాని కోసం రూ. 7 లక్షలు జరిమానా చెల్లించింది.


HDFC AMC: హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీలో తన వాటాను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund) భారీగా పెంచుకుంది. గతంలో ఉన్న స్టేక్‌ను 2.9 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది.


శ్యామ్ మెటాలిక్స్: పశ్చిమ బంగాల్‌లోని జమురియాలో ఉన్న తయారీ ఫ్లాంట్‌లో మరిన్ని ప్రొడక్షన్‌ కెపాసిటీస్‌ ప్రారంభించినట్లు శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ (Shyam Metalics and Energy) ప్రకటించింది. దీంతో, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ సామర్థ్యం 90 మెగావాట్లు పెరిగి, ప్రస్తుతం ఉన్న 267 మెగావాట్ల నుంచి 357 మెగావాట్లకు చేరుతుంది.