ఏపీలో సంక్షేమ పథకాల డబ్బులు జమ
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బుల జమపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన తర్వాతే డబ్బులను లబ్ధిదారులకు జమ చేయాలని స్పష్టం చేసింది. మే 13న పోలింగ్ తర్వాత డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే పలు పథకాలకు సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా.. ఆ వినతిని తిరస్కరించింది. ఇంకా చదవండి
జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్
ఏపీ సీఎం జగన్ (CM Jagan) తనకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి (Nampally) సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న తన సతీమణి భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు. తన కూతుళ్లను కలిసేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ పిటిషన్ పై గురువారం విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని న్యాయస్థానానికి తెలిపింది. 'ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదు. ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉంది.' అని సీబీఐ పేర్కొంది. ఇంకా చదవండి
అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు
కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆమె గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో ఆమెతో పాటు వైఎస్ సునీత పాల్గొన్నారు. 'ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. ఇక్కడ న్యాయం గెలుస్తుందా.?. నేరం గెలుస్తుందా.?. ప్రజలు న్యాయాన్ని గెలిపించాలి. ఓ వైపు వైఎస్ఆర్ బిడ్డ, ఇంకోవైపు వివేకా హత్య కేసు నిందితుడు. అవినాష్ రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉండి.. కడప స్టీల్ గురించి పట్టింపు లేదు. ఇంకా చదవండి
మేడ్చల్ జిల్లాలో దారుణం
మేడ్చల్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మైసిరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కర్రలతో ఇరువర్గాలు దారుణంగా కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ఓ వర్గం వారు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. ఇంకా చదవండి
భాగ్యనగరంలో భారీ వర్షాలు
భాగ్యనగరంలో భారీ వర్షాల వల్ల మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupally Police Station) పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో షెడ్డులో నివసిస్తోన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఇక్కడ గతంలో 10 - 15 అడుగుల ఎత్తు వరకూ ప్రహరీ నిర్మించగా.. తర్వాత దానినే 30 - 40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా చదవండి