Two Groups Attack In Medchal: మేడ్చల్ (Medchal) జిల్లాలో దారుణం జరిగింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి (Mysireddipally) గ్రామ రెవెన్యూ పరిధిలో భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూ వివాదం నెలకొనగా.. ఓ వర్గం వారు కొంతమంది రౌడీ మూకలను తీసుకొచ్చి వేరే వర్గంపై దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనగా.. రెండు గ్రూపులు కర్రలు, కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భూయజమాని ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.
Medchal News: మేడ్చల్ జిల్లాలో దారుణం - భూ వివాదంతో కత్తులు, కర్రలతో ఇరువర్గాల దాడి
ABP Desam | 09 May 2024 04:08 PM (IST)
Telangana News: మేడ్చల్ జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా భయాందోళన నెలకొంది. భూ వివాదం నేపథ్యంలో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ భూవివాదంలో ఇరువర్గాల ఘర్షణ