Rashmika Mandanna sings one more film in Hindi after Animal success: పాన్ ఇండియా సినిమాలకు ఫిమేల్ లీడ్ ఆప్షన్ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక పేరు ఫస్ట్ ప్లేసులో ఉంటోంది. ముఖ్యంగా హిందీ సినిమాలు తీసే దర్శక నిర్మాతలు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లోకి తమ సినిమా వెళ్లేందుకు ఆమెను కథానాయికగా ఎంపిక చేసుకుంటున్నారు. దక్షిణాది ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, ఉత్తరాదిలోనూ ఆమెకు క్రేజ్ ఉండటంతో ప్లస్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సల్మాన్ ఖాన్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం రష్మికను వరించింది.


సల్మాన్ జోడీగా రష్మిక
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కథానాయకుడిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సికిందర్ (Sikandar Movie Salman Khan) టైటిల్ ఖరారు చేశారు. అందులో రష్మిక కథానాయిక. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. 'యానిమల్' సక్సెస్ తర్వాత 'పుష్ప 2', 'కుబేర' చేస్తున్న రష్మిక ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా 'సికందర్' చేరింది.


''మా చిత్ర బృందంలోకి రష్మికను స్వాగతిస్తున్నాం. 'సికిందర్'లో సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటించనున్నారు'' అని నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. 


Also Readచిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?



''నా నెక్స్ట్ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు, అభిమానులు చాలా రోజులుగా అడుగుతున్నారు. ఇదిగో ఆ అప్డేట్... 'సికిందర్' సినిమాలో నేనూ ఓ భాగం కావడం నిజంగా ఎంతో గొప్ప అనుభూతి. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను'' అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో రష్మిక పోస్ట్ చేశారు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు






వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల
రంజాన్ సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. హీరోగా సల్మాన్ ప్రయాణంలో ప్రతి ఏడాది రంజాన్ పండక్కి ఏదో ఒక స్పెషలిటీ ఉంటుంది. కొత్త సినిమా అనౌన్స్ చేయడం, లేదంటే థియేటర్లలో సినిమాను విడుదల చేయడం చేస్తుంటారు. ఈద్ పండక్కి సల్మాన్ సినిమా వస్తే బాక్సాఫీస్ బరిలో భారీ హిట్ గ్యారంటీ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతాయి. అందులో ఆయన సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఉదాహరణ. ఇప్పుడీ ఏఆర్ మురుగదాస్ సినిమా కూడా వచ్చే ఏడాది రంజాన్ పండక్కి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.



పదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో విజయ్ 'కత్తి' (తెలుగులో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150')ని మురుగదాస్ రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ సినిమా కుదరలేదు. ఇప్పటికి ఆ కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతో సల్మాన్ ఖాన్ చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. 'జుడ్వా', 'ముజ్ సే షాదీ కరోగి', 'కిక్' వాళ్లిద్దరి కలయికలో వచ్చినవే.