తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు కీలక ఘట్టం మొదలైంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ (Election Nominations) ప్రారంభమైంది. ఏపీలో (Ap) 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణ 17 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలి రోజు ఆర్వో కేంద్రాల్లో పలువురు కీలక నేతలు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు గడువు విధించారు. ఆ లోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. ఇంకా చదవండి


అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ


తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధికారి చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఫోన్ లో ఫోటోలు తీస్తుండగా గుర్తించిన మహిళ తగిన బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారాయణఖేడ్ (Narayankhed) పట్టణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ నివాసం ఉంటున్నారు. అయితే, పక్క పోర్షన్ లో ఉన్న ఓ మహిళ.. డిప్యూటీ తహసీల్దార్ తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ అతని చెంప పగలగొట్టింది. ఇంకా చదవండి


HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో (HCU) విద్యార్థుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వర్శిటీలోని ఏబీవీపీ (ABVP), ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం రేగగా.. విద్యార్థి సంఘాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓ వర్గం వారు బ్లేడ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు సద్దిచెప్పి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇంకా చదవండి


నాల్గో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు మరో దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రచారం పీక్‌లో ఉంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న వేళ రాజకీయం మరింత హాట్‌ హాట్‌గా మారబోతోంది. ఇంకా చదవండి


నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి


దేశ వ్యాప్తంగా ఇదివరకే మూడు దశల ఎన్నికలకు నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) విడుదల చేసింది. నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేయనుంది ఈసీ. ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో.. మొత్తంగా 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న నాల్గో దశ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దాంతో గురువారం నుంచే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 25న నామినేషన్ స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29న ముగియనుంది. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4న ఓట్లు లెక్కించి విజేతల్ని ప్రకటించనున్నారు. ఇంకా చదవండి