Students Clash In Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో (HCU) విద్యార్థుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వర్శిటీలోని ఏబీవీపీ (ABVP), ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం రేగగా.. విద్యార్థి సంఘాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓ వర్గం వారు బ్లేడ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు సద్దిచెప్పి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చందానగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వర్శిటీలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం