Haier S800QT 4K QLED Smart TV Series: ప్రముఖ గృహోపకరణాల బ్రాండ్ హాయర్ మనదేశంలో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఎస్800క్యూటీ పేరుతో ఈ సిరీస్ మార్కెట్లోకి వచ్చింది. 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ హాయర్ ఎస్800క్యూటీ సిరీస్‌లో 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. ఇవి డాల్బీ విజన్, అట్మాస్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపన్సేషన్ టెక్నాలజీలను ఇది సపోర్ట్ చేయనుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ లైనప్‌ను బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ టీవీ మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.


హాయర్ ఎస్800క్యూటీ క్యూఎల్ఈడీ సిరీస్ ధర
ఈ కొత్త క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీల్లో 43 అంగుళాల బేస్ వేరియంట్ ధర రూ.38,990గా ఉంది. 55 అంగుళాల వేరియంట్ ధరను రూ.56,990గా నిర్ణయించారు. ఇక 65 అంగుళాల వేరియంట్ ధర రూ.79,990గానూ, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,27,990గానూ ఉంది. ఈ కొత్త టీవీలు ఆన్‌లైన్‌లోనూ, లీడింగ్ రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉండనున్నాయి.


హాయర్ ఎస్800క్యూటీ సిరీస్ స్పెసిఫికేషన్లు
హాయర్ ఇటీవల లాంచ్ చేసిన ఎస్800క్యూటీ సిరీస్‌లో 4కే రిజల్యూషన్ ఉన్న క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయి. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను డెలివర్ చేసే డాల్బీ విజన్, అట్మాస్ సపోర్ట్ ఉన్న డిస్‌ప్లేలను వీటిలో అందించారు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పని చేయనున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌కు యాక్సెస్ కూడా ఇందులో లభించనుంది. మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపన్సేషన్ టెక్నాలజీ (ఎంఈఎంసీ), డ్యూయల్ లైన్ గేట్ (డీఎల్‌జీ) టెక్నాలజీలను కూడా ఈ టీవీలు సపోర్ట్ చేయనున్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను వీటిలో అందించారు.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


గూగుల్ అసిస్టెంట్ అందించే ఏఐ స్మార్ట్ వాయిస్ ఫీచర్‌ను ఈ కొత్త టీవీ సిరీస్‌లో అందించారు. ఈ ఫీచర్ ద్వారా మీ టీవీని వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చు. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే డ్యూయల్ స్పీకర్లను ఈ టీవీల్లో అందించారు. బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా వీటిలో ఉంది.


హాయర్ ఎస్800క్యూటీ స్మార్ట్ టీవీ మోడల్స్‌లో బ్లూటూత్ వాయిస్ రిమోట్‌ను అందించారు. రెండు యూఎస్‌బీ పోర్టులు, నాలుగు హెచ్‌డీఎంఐ పోర్టులు, హెడ్ ఫోన్ అవుట్‌పుట్ కూడా ఈ టీవీలో చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఇది సపోర్ట్ చేయనుంది. 






Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు