ఐ ప్యాక్ ఆఫీసులో జగన్


మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ అధినేత, సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఐ ప్యాక్ ఆఫీసుకు జగన్ వెళ్లారు. పార్టీ కోసం పని చేసిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాారు.  వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామన్నారు.  రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని అన్నారు.   జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని ప్రకటించారు.  22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని..   ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని జోస్యం  చెప్పారు. ఇంకా చదవండి


టీఎస్ఆర్టీసీ బస్‌పై దుండగుల దాడి


తెలంగాణ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని దుండుగలు దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. బైక్‌పై వచ్చిన దుండగులు....కదులుతున్న బస్సు( TS RTC) పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోగా...అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్‌(Hyderabad) శివారులోని రాచలూరు గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా చదవండి


ఆంధ్రప్రదేశ్‌లో డీబీటీ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి కారణమైన డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు పేర్కొంది. బుధవారం ఒక్కరోజే లబ్ధిదారుల ఖాత్లాలో నిధులు జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఆసరా పథకం కింద 1480 కోట్ల రూపాయలు విద్యాదీవెన కింద 502 కోట్లు విడుదల చేశారు. అన్ని పథకాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం  పేర్కొంది. ఇంకా చదవండి


రైల్వే మరమ్మతులు కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు


విజయవాడ(Vijayawada), గుంటూరు(Guntur) డివిజన్‌లలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేశారు. పోలింగ్ కోసం సొంత ఊర్లకు వెళ్లిన వారు ఇంకా పూర్తిగా తిరిగి వెళ్లలేదు. పైగా వేసవికాలం కావడంతో రద్దీ కూడా ఎక్కువగానే ఉన్న సమయంలో రైళ్లు రద్దు చేయడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి


రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారా?


'టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ‘ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అందించినా ఏం లాభం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు మారాయా?’ అని చంద్రబాబు అన్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, 'ఫ్యాక్ట్ లీ' ఈ వీడియోకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. ఇంకా చదవండి