Train Cancel: విజయవాడ(Vijayawada), గుంటూరు(Guntur) డివిజన్‌లలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేశారు. పోలింగ్ కోసం సొంత ఊర్లకు వెళ్లిన వారు ఇంకా పూర్తిగా తిరిగి వెళ్లలేదు. పైగా వేసవికాలం కావడంతో రద్దీ కూడా ఎక్కువగానే ఉన్న సమయంలో రైళ్లు రద్దు చేయడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

రైళ్లు రద్దువేసవికాలం వచ్చిందంటే రైల్వేశాక ట్రాక్‌ మరమ్మతులు, సిగ్నిలింగ్ వ్యవస్థ మరమ్మతులు సహా ఇతర సాంకేతిక అంశాలను ఒకసారి తనిఖీ చేసుకోవడం పరిపాటి. అందులో భాగంగానే విజయవాడ(Vijayawada), గుంటూరు(Guntur) డివిజన్‌లలో ట్రాక్‌ మరమ్మతులు చేపట్టింది. పాడైపోయిన ట్రాక్‌ తీసి కొత్తగా వేయడం, జాయింట్ల వద్ద పగుళ్లు నివారించడం....ట్రాక్ మార్పిడి వంటి కీలకమైన పనులు చేస్తోంది. దీనివల్ల ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్  మండ్రూప్కర్‌ తెలిపారు.

రద్దయిన రైళ్లు ఇవే...

రాజమండ్రి-విజయవాడ(Rajahmundry-Vijayawada) ( (07466/07467) రైళ్లు ఈనెల 15 నుంచి 26 వరకు రద్దునర్సాపూర్‌ - విజయవాడ(Narsapur-Vijayawada) (17270/07862)  రైళ్లు ఈనెల 15 నుంచి 26 వరకు రద్దు నర్సాపూర్‌-రాజమండ్రి( Narsapur- Rajahmundry) (07883/07884) రైళ్లు ఈనెల 15 నుంచి 26 వరకు రద్దువిశాఖపట్నం-గుంటూరు(Vizag- Guntur) (22701/22702/17239) రైళ్లు ఈనెల 15 నుంచి 26 వరకు రద్దువిశాఖపట్నం-గుంటూరు (Vizag- Guntur) (17240) రైలు ఈనెల 16 నుంచి 27 వరకు రద్దునర్సాపూర్‌-గుంటూరు(Narsapur-Guntur)  (17282) రైలు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దుగుంటూరు-నర్సాపూర్‌(Guntur-Narsapur) (17281) రైలు ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు రద్దుహుబ్లీ-విజయవాడ(Hubballi-Vjayawada) (17329) రైలు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దు విజయవాడ-హుబ్లీ(Vijayawada- Hubbali) (17330) రైలు ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు రద్దు రామవరప్పాడు - నర్సాపూర్‌(Ramavarappadu- Narsapur) (07861) రైలు  భీమవరం-నర్సాపూర్‌ మధ్య పాక్షికంగా రద్దు 

రైళ్ల రద్దు కారణాంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.