తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - ఎకరానికి రూ. పదివేలు పంపిణీ తేదీ ఫిక్స్ !


అకాల వర్షాల వల్ల పంట కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేలు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆ నగదును పంపిణీ చేసే తేదీని ఖరారు చేసింది. పన్నెండో తేదీ నుంచి రైతులకు సాయం పంపిణీ  చేయనున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను గతనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వరంగల్‌ జిల్లా పర్యటనకు వచ్చి పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎకరానికి 10 వేలరూపాయలచొప్పున పంటనష్టపరిహారాన్ని అందిస్తామని ప్రకటించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పంటనష్టపరిహారంకు సంబంధించిన చెక్కులను ఈనెల 12 నుంచి రైతులకు అందించనున్నట్లు   ప్రభుత్వం ప్రకటించింది. 


సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇంత వరకూ పరిహారం ఇవ్వడం లేదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఆగడం లేదు. వర్షాలు తెరిపినిచ్చిన తర్వాత బాధిత రైతులందరికీ ఒకే సారి నగదు పంపిణీ చేయనున్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇవ్వనున్నారు.  వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన కౌలు రైతుల వివరాలను  ప్రభుత్వానికి అందించారు.  అకాల వర్షాలు రైతాంగాన్ని అపార కష్ట నష్టాల్లోకి నెడుతున్నాయి. ఎండా కాలంలో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోతున్నది అయితే, రైతులు ఆ ధైర్యపడవద్దని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నరు. ఇంకా చదవండి


ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్‌ ప్రారంభం


ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్(BRS ) కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ప్రారంభించారు. అంతకంటే ముందు అక్కడ జరిగిన పూజ,యాగంలో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. త‌ర్వాత శిలాఫ‌లకాన్ని ఆవిష్కరించారు. కరెక్ట్‌గా ఒంటిగంట ఐదు నిమిషాలకు రిబన్ కట్ చేసి భవనంలోకి ప్రవేశించారు. 


ఓపెనింగ్ తర్వాత తన ఛాంబర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడకు చేరుకున్న పార్టీ నేతలు, మంత్రులు, ఇతర శ్రేణులు ఒక్కొక్కరిగా వచ్చి సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా చదవండి


అకాల వర్షాలతో జరిగిన పంటనష్టంపై సీఎం జగన్ సమీక్ష


ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్  సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు వివరించారు. 


వివరాలు పరిశీలించిన జగన్... రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్నారు. వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఇంకా చదవండి


ముస్లిం మైనార్టీ వర్గాలను మరింత ఆకట్టుకునేలా వైసీపీ భారీ ప్లాన్


ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం వర్గాలను మరింత దగ్గర చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ముస్లిం వర్గాలతో నియోజకవర్గాల వారీగా అవసరమైతే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కీలక నేతలతో అధినాయకత్వం మంతనాలు జరుపుతున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 


కీలకంగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలతో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా గతంలో రాజకీయపార్టీలు ఉపయోగించుకునేవని సజ్జల కామెంట్‌ చేశారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు వైఎస్‌ జగన్ ముస్లిం మైనారిటీల్లో వెనకబాటుతనాన్ని రూపుమాపాలనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి కుటుంబాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. వైఎస్ జగన్ ముస్లిం మైనారిటీలను శాసన సభ్యులుగా ,శాసన మండలి సభ్యులుగా నామినేటెడ్ పదవుల్లో, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇంకా చదవండి


దుర్గగుడి సూపరింటెండెంట్ నివాసంలో రెండో రోజూ ఏసీబీ సోదాలు


ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులుగా అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న తనిఖీలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు అవినీతి అధికారుల ఆస్తుల వివరాలు రాబట్టిన అధికారులు మరికొందరి భరతంపట్టే పనిలో ఉన్నారు. ఇంకా చదవండి