Top 10 Headlines Today:  


నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం telugu.abplive.com , tsbie.cgg.gov.inలో చెక్‌ చేసుకోండి.


నేటి నుంచి జగనన్నకు చెబుదాం.. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రెడీ అయ్యింది. ఇవాళ్టి నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందించటం ఈ కార్యక్రమం స్పెషాలిటీగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇది మరో ప్రతిష్టాత్మక కార్యక్రంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసం 1902 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పెడుతున్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షలు చేశారు. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి జగన్ పేరును కలపి నిర్వహించే కార్యక్రమం ద్వారా సీరియస్ నెస్ ను పెంచేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంటనేది ఇప్పటికే జిల్లా స్థాయిలోని అధికారులకు కూడా స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


డ్రగ్స్‌ కలకలం
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు నగరంలోకి రాకముందే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేశారు. దీని విలువ దాదాపు రూ.41.3 కోట్ల రూపాయలు అని తెలిపారు. హెరాయిన్ బరువు 5.9 కిలోలను ఓ మహిళ వద్ద డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె ఏకంగా సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 


కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ లోని అంశాలు 
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ఉద్యమ వీరులుగా గుర్తించి, వారి తల్లి లేదా తండ్రి, లేదా భార్యకు రూ.25 వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిని స్వాతంత్ర సమరయోధులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 


ప్రియాంక ఫైర్స్‌
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, రాష్ట్ర డబ్బు, సంపద అంతా ఎక్కడికి పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు. లేదంటే ప్రజలే నష్టపోతారని చెప్పారు. గడిచిన రెండు వారాలుగా తాను కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 


సిక్కుల కోసం కార్పొరేషన్‌ 
రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో ముఖ్యంత్రిని సిక్కు మత పెద్దలు కలసి తమ సమస్యలను గురించి వివరించారు. ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్బంగా సిక్కు పెద్దలు సీఎంకు వివరించారు. సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారి కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సిక్కు పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 


ఖరీదైన స్టాక్‌
 భారత స్టాక్ మార్కెట్లోనే అత్యంత ఖరీదైన ఒక స్టాక్ ఇప్పుడు మంచి బూమ్‌లో ఉంది, లక్ష రూపాయలకు చేరువైంది. ఈ షేర్ ఒక లక్ష రూపాయల మైలురాయిని చేరితే, భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఆ ఘనత సాధించిన మొదటి కంపెనీగా నిలుస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 


లక్ష్మీదేవి వచ్చినప్పుడు కనిపించే సంకేతాలు 
లక్ష్మీదేవి రావడానికి ముందే కొన్ని ప్రత్యేక సంకేతాలు మనకు కనిపిస్తాయని పండితులు అంటున్నారు. అలాంటి సంకేతాలు కనిపిస్తే చాలా పెద్ద ధనలాభం కలుగబోతోందని కచ్చితంగా చెప్పవచ్చట. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 


పశ్చిమ బెంగాల్ సైతం అదే నిర్ణయం
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు వెనకడుగు వేస్తున్నాయి. షోను రద్దు చేస్తున్నాయి. అల్లరు జరిగితే థియేటర్లు ధ్వంసం చేస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 


మళ్లీ మెరిసిన రింకూ
ఐపీఎల్‌ 2023 సీజన్ 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ నితీష్ రాణా (51: 38 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. చివర్లో ఒత్తిడిలో రింకూ సింగ్ (21 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చివరి బంతికి బౌండరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి