హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు నగరంలోకి రాకముందే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేశారు. దీని విలువ దాదాపు రూ.41.3 కోట్ల రూపాయలు అని తెలిపారు. హెరాయిన్ బరువు 5.9 కిలోలను ఓ మహిళ వద్ద డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె ఏకంగా సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
Drugs in Hyderabad: హైదరాబాద్‌లో 41 కోట్ల విలువైన డ్రగ్స్, ఓ మహిళ వద్ద స్వాధీనం
ABP Desam
Updated at:
08 May 2023 09:41 PM (IST)
ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ప్రతీకాత్మక చిత్రం