Top 10 Headlines Today
మోదీ చేసిన కామెంట్స్ బీజేపీకి ప్లస్సా? మైనస్సా?
నిజామాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఎన్డీఏలో చేరేందుకు కేసీయార్ ప్రతిపాదనలు పెట్టారని తాను తిరస్కరించారని.. ప్రధాని స్వయంగా ప్రకటించారు. అది జరిగింది ఇప్పుడు కాదు రెండేళ్ల కిందట. మరి ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు ?. చాలా సార్లు తెలంగాణలో సభలు ఏర్పాటు చేసినప్పటికీ కేసీఆర్ ను కనీస మాత్రంగా కూడా విమర్శించని మోదీ ఇప్పుడు కేసీఆర్ తమతో జత కట్టాలనుకున్న విషయాన్ని ఎందుకు బయట పెట్టారు ? . ఇలా చెప్పడం వల్ల బీజేపీకి ఎంత లాభం అన్నది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఐటీ దాడులు
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ తో పాటు నగర శివార్లలోని ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వెనక్కి తగ్గారా?
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఇక నెక్ట్స్ లోకేష్ అని చెప్పడం ప్రారంభించారు. సీఐడీ చీఫ్ సంజయ్ కూడా అదే చెప్పారు. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ పేరు కూడా చెప్పేవారు. ఆయనపైనా రెండు, మూడు కేసులు ఉన్నాయని చెప్పేవారు. ఆ తర్వాత ఏ క్షణమైనా అరెస్టు అని ప్రచారం కూడా జరిగింది. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా .. సీఐడీ కదలికల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా ప్రకటనలు చేసింది. లోకేష్ సీఐడీ అధికారులకు అందుబాటులోకి రాలేదని.. విదేశాలకు వెళ్లాడనీ ప్రచారం చేశారు. కానీ ఇప్పడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తే ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు వినిపించాలో కూడా ఏజీకి చెప్పలేదు. ఒక్క సారిగా పరిస్థితి ఎందుకు మారిపోయిందని టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కారు ఎక్కిన నందికంటి శ్రీధర్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్నారు. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జ్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో బీఆర్ఎస్ మల్కాజిగిరి సీటు శ్రీధర్ కు దక్కుతుందని వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జూనియర్‌పై స్పందించిన బాలయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై సినిమా వాళ్లు స్పందించక పోవడాన్ని పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్, రోజా స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఢీ
ప్రపంచ కప్‌లో బుధవారం జరిగే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టనుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రెండు భాగాలుగా 'దేవర'(Devara)
దర్శకుడు కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో తాను తెరకెక్కిస్తున్న 'దేవర'(Devara) మూవీ రెండు భాగాలుగా వస్తుందని అధికారికంగా ప్రకటించాడు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. 'బాహుబలి' తర్వాత 'కే జి ఎఫ్' రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. 'పొన్ని యన్ సెల్వన్' కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఐకాన్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సైతం రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే పార్ట్ వన్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్ష సూచన
‘నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ మారాత్వాడ వరకు ఉన్న ద్రోణి ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ నుండి ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు విస్తరించి సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ వరకు కొనసాగుతుంది. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నవి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రతిక సంపాదన ఎంతంటే?
బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టింది రతిక. తనను చూసిన మొదటి క్షణం నుండే చాలామంది ప్రేక్షకులు తనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండే రతిక.. తన ఆట మొదలుపెట్టింది. ముందుగా పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉంటూ.. స్నేహం చేసింది. ఆపై తనపైనే నిందలు వేసింది. బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ కొందరికి అనూహ్యంగా అనిపించినా.. కొందరు మాత్రం తను వెళ్లిపోవడమే మంచిదయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇంతకు రతిక.. ఈ నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందో తెలుసా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి