బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టింది రతిక. తనను చూసిన మొదటి క్షణం నుండే చాలామంది ప్రేక్షకులు తనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండే రతిక.. తన ఆట మొదలుపెట్టింది. ముందుగా పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉంటూ.. స్నేహం చేసింది. ఆపై తనపైనే నిందలు వేసింది. బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ కొందరికి అనూహ్యంగా అనిపించినా.. కొందరు మాత్రం తను వెళ్లిపోవడమే మంచిదయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇంతకు రతిక.. ఈ నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందో తెలుసా..


ఫేమ్ కోసం వచ్చింది..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన రోజు అసలు ఈ షోలోకి ఎందుకు వచ్చినట్టు అని నాగార్జున అడగగా.. తాను ఎన్నో సినిమాల్లో నటించానని, అయినా గుర్తింపు రాలేదని, అందుకే బిగ్ బాస్‌లోకి వచ్చానని రతిక క్లియర్‌గా చెప్పింది. నిజంగానే రతిక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో కనిపించింది. కొన్ని సినిమాల్లో తన పాత్ర నిడివి పెద్దగానే ఉన్నా కూడా తనకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే బిగ్ బాస్‌‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఆకర్షించడానికి విపరీతంగా ప్రయత్నాలు చేసింది. టాస్కుల విషయంలో ఎలా ఉన్నా.. రోజూ అందంగా రెడీ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం మిస్ అయ్యేది కాదు రతిక. ఇక రతిక.. ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడానికి తను చేసిన కొన్ని తప్పులే కారణం అయ్యిండవచ్చు.


ముగ్గురూ ఒక టీమ్..
ముందుగా పల్లవి ప్రశాంత్, శివాజీ, రతిక.. ఈ ముగ్గురు ఒక టీమ్‌గా ఉండేవారు. కానీ పల్లవి ప్రశాంత్.. తనను ఇష్టపడుతున్నాడు అని తెలిసినా.. రెండు వారాలపాటు మౌనంగా ఉన్న రతిక.. రెండో వారం నామినేషన్స్‌లో తనను ఎదిరించి మాట్లాడింది. దీంతో వారిద్దరూ మట్లాడుకోవడం మానేశారు. కానీ అప్పుడప్పుడు ప్రశాంత్‌తో మళ్లీ చనువుగా ఉండడానికి ప్రయత్నించేది రతిక. మళ్లీ ప్రశాంతే తప్పు చేశాడు అంటూ పాత విషయాలు అన్నీ ఎత్తిచూపేది. ప్రశాంత్ విషయం పక్కన పెడితే.. శివాజీతో కూడా రతికకు ఉన్న ఫ్రెండ్‌షిప్ మెల్లగా కట్ అయిపోయింది. అలా ఫ్రెండ్‌షిప్ కట్ అవ్వగానే శివాజీ గురించి హౌజ్‌లో నెగిటివ్‌గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రేక్షకులకు తన పట్ల నెగిటివిటీ మరింత ఎక్కువయిపోయింది.


రతిక రెమ్యునరేషన్ ఎంతంటే..
మామూలుగా బిగ్ బాస్‌లోకి ఎవరైనా డబ్బు లేదా ఫేమ్.. ఈ రెండిటి కోసమే అడుగుపెడతారు. ముందుగా ఫేమ్ కోసం బిగ్ బాస్‌లోకి వచ్చానని చెప్పింది రతిక. కానీ అది పూర్తిస్థాయిలో దక్కకముందే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. పైగా ఎలిమినేట్ అయ్యే ముందు తను ప్రేక్షకుల దృష్టిలో చాలా నెగిటివ్‌గా మారిపోయింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రతిక.. దాదాపు రూ.8 లక్షలు సంపాదించుకున్నట్టు సమాచారం. బిగ్ బాస్‌లో తను ఉంటున్న ప్రతీ వారానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్ అందుకుందట రతిక. అంటే తను పూర్తిగా నాలుగు వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో ఉంది. అంటే తనకు దీని ద్వారా రూ.8 లక్షల రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది.


Also Read: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial