తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది.
మరోవైపు, పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5 ఉదయానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు బోర్డు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్వీకరించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు కటాఫ్ మార్కుల వివరాలను కూాడా పోలీసు నియామక మండలి అందుబాటులో ఉంచింది.
➥ SCT PC Civil selection Cut-Offs
➥ SCT PC IT & CO/MechanicIdriver selection Cut-Offs
➥ Transport constable Cut-Offs
➥ Prohibition & Excise Constable Cut-Offs
ALSO READ:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్-నాగ్‌పుర్‌లో 68 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీజీ డిగ్రీ/ ఎంఏ/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. కంప్యూటర్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..