జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాలుగో విడత చేపట్టిన వారాహి యాత్రపై పోలీసుల కనుసనల్లోనే వైసీపీ రౌడీ మూకలు దాడికి కుట్ర పన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు.
బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ రోజు పెడన నియోజవర్గంలో జరగబోయే వారాహియాత్రపై వైసీపీ మూకలు దాడి చేసే యత్నాన్ని ముందుగానే పోలీసులకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. గతంలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని తన దగ్గర ఉన్న సమాచారంతో పోలీసులకు సమాచారం ఇస్తే తిరిగి వారికే నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యం ఎటు పోతుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసులు వ్యవహరించిన వ్యవహార శైలి ప్రస్తుత కడనలో జరగబోయే యాత్రలో అనుసరిస్తారని అనుమానాలు ఉన్నాయి.
స్థానిక డీఎస్పీకి దాడికి సంబంధించి సమాచారం ఇస్తే తిరిగి సమాచారం ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యనికే సిగ్గుచేటు. వారాహి యాత్రపై దాడికి సంబంధించి ముందుగా సమాచారం ఇస్తే మీ దగ్గర రిపోర్ట్స్ ఏం ఉన్నాయని డీఎస్పీ ప్రశ్నించారు. పెడనలో వైసీపీ మూకలు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపితే దానికి మీరు ఏమని బదులిస్తారని పోలీస్‌లు ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల సహనాన్ని ఆసరాగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాను. పెడన బహిరంగ సభలో కవ్వింపు చర్యలకు పాల్పడితే దానికి దీటుగానే బదులిస్తాం. పోలీసులు వైసీపీ గుండాలను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్లను ముట్టడించడానికి అయినా సిద్ధమవుతాం’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటు పోతుందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసులు వ్యవహరించిన వ్యవహార శైలిపై ప్రస్తుతం పెడనలో జరిగే వారహి యాత్రలో అనుసరిస్తారేమోనని అనుమానం కలుగుతోందని చెప్పారు. స్థానిక డిఎస్పి కి దాడికి సంబంధించి సమాచారం ఇస్తే తిరిగి సమాచారం ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యనికే సిగ్గుచేటని విమర్శించారు.
దాడికి సంబంధించి ముందుగా సమాచారం ఇస్తే మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని డీఎస్పీ అడిగారన్నారు. పెడనలో వైసీపీ రౌడీలు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపితే దానికి మీరు ఏమని బదులుస్తారని పోలీసులను ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల సహనాన్ని ఆసరాగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. పెడన బహిరంగ సభలో కవ్వింపు చర్యలకు పాల్పడితే దానికి దీటుగానే బదులిస్తామని చెప్పారు. పోలీసులు వైసిపి గుండాలను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్లు ముట్టడించడానికి అయినా వెనుకడుగు వేయడం అని హెచ్చరించారు.
రాష్ట్ర సుస్థిరత కోసం జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని, దాడులతో ఈ కలయికను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అయన ఆరోపించారు. వారాహి విజయయాత్రలో రాళ్లదాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, డీఐజీలు, ఎస్పీ సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పులివెందుల మాదిరిగా ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని సీఎంను ఉద్దేశించి రవీంద్ర వ్యాఖ్యానించారు.
పవన్ కు కృష్ణా ఎస్పీ నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు. పెడన వారాహి యాత్రలో దాడులు చేస్తారని దీనిపై విశ్వసనీయ సమాచారం ఉందని మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దాడులపై సమాచారం ఉంటే ఇవ్వాలని పవన్ కు జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు.