Top 10 Headlines Today:


టీడీపీ, జనసేనకు పొత్తు నొప్పులు


ఈసారి కచ్చితంగా కొట్టి తీరాల్సిందే అనుకుని.. మాటా మాటా అనుకోకుండా ఓకే మాటగా నడుస్తున్న తెలుగుదేశం- జనసేన సీట్ల పంపకాల విషయంలో తంటాలు పడుతున్నాయా అంటే... పరిస్థితి అలాగే కనిపిస్తోంది. పార్టీ మీటింగుల్లో, పబ్లిక్ మీటింగుల్లో ఫ్రెండ్‌షిప్‌ను షేర్ చేసుకున్నంత తేలిక కాదు.. సీట్లను షేర్ చేయడం. ఆ పరిస్థితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ఎదురవుతోంది. టీడీపీ పబ్లిక్ మీటింగుల్లో అన్యాపదేశంగా కాండిడేట్లను అనౌన్స్ చేస్తోందని విమర్శిస్తున్న జనసేన... ఇన్ కెమెరా మీటింగుల్లో అదే పనిచేస్తోందా.. తమ కాండిడెట్లను వర్క్ చేసుకోమని సెలంట్ గా హింట్ ఇస్తోందా.. పవన్ కళ్యాణ్ వైజాగ్ మీటింగ్ తర్వాత జనసేన- టీడీపీ కుంపట్లో క్రాకర్స్ పేలుతున్నాయి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వనజాతర ప్రారంభం


ఆసియాలోనే అతిపెద్దదైన వనజాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లే కదిలి వెళ్తున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర చూసి వనదేవతలను పూజించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు జనం వనం బాట పట్టారు. తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కదలి వస్తున్న భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కవిత యాక్టివ్‌


బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో, కవిత జాతీయ రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీగా ఉన్నప్పుడు .. ఓడిపోయిన తర్వాత  బీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడూ కవితే కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె కేటీఆర్ కన్నా ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పై తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అకాయ్‌ వచ్చేశాడు


బాలీవుడ్‌ నటి, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ మరోసారి తల్లయ్యింది. ఈ నెల 15న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కారు దుమారం 


తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని తన వద్ద ఆధారాలున్నాయని బీజేపీ నేత  ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్ ఆరోపించారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు తాళాలు ఎవరు ఇచ్చారో తన దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నాయంటూ NVSS తన ఆరోపణల దాడిని మరింత తీవ్రం చేశారు. సీట్లు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ నేతలు ఇలా చేస్తారంటూ ఆయన మరిన్ని ఆరోపణలు చేశారు. ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు.NVSS ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


లాస్ట్ డే


ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. అయితే ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేటి మార్కెట్‌ ట్రెండ్ 


మంగళవారం మరోమారు రికార్డు స్థాయికి చేరిన నిఫ్టీ, ఈ రోజు (బుధవారం) హడావిడి లేకుండా ఆరంభమయ్యే అవకాశం ఉంది. బెంచ్‌మార్క్‌ సూచీలను కదిలించే గట్టి ట్రిగ్గర్స్‌కు దేశీయంగా లేవు. గ్లోబల్ ట్రిగ్గర్స్‌ & స్టాక్‌ స్పెసిఫిక్‌ వార్తల ఆధారంగా పెట్టుబడిదార్లు నిర్ణయాలు తీసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సందీప్‌ రెడ్డికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు


దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. ఇక 2024 సంవత్సరానికిగానూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల విన్నర్స్ ఎవరు అనే విషయం బయటికొచ్చింది. షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ, నయనతార, సందీప్ రెడ్డి వంగా తదితరులకు అవార్డులు దక్కాయి. ‘జవాన్’ సినిమాలో తన నటనతో ఇంప్రెస్ చేసినందుకు షారుఖ్ ఖాన్‌కు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో అవార్డుల దక్కగా.. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన నయనతారకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ‘జవాన్’ చిత్రానికి మరొక కేటగిరిలో కూడా అవార్డు దక్కింది. అదే మ్యూజిక్ డైరెక్షన్. ఈ సినిమాకు మ్యూజిక్ అందింనందుకు అనిరుధ్‌ రవిచందర్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జస్‌ప్రీత్‌  బుమ్రా దూరం


ఊహాగానాలే నిజమయ్యాయి. రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ర్పిత్‌ బుమ్రా(Bumrah) ఆడడం లేదు. పని భారం ఎక్కువ అవుతుండడంతో  కీలకమైన నాలుగో టెస్ట్‌కు  బుమ్రాకు  విశ్రాంతి ఇచ్చారు. బుమ్రాను నాలుగో టెస్ట్‌లో జట్టులోకి తీసుకోలేదని... టెస్టు సిరీస్‌ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎల్లో టీ ప్రత్యేకతలు


రుచిలో కాస్త భిన్నంగా ఉండే ఎల్లో టీ దాని ప్రత్యేకతలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. విభిన్నమైన రుచితో పాటు.. మృదువైన టెక్స్చ్​ర్, ఆహ్లాదకరమైన వాసనతో ఇది ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది కొంచెం గ్రీన్​ టీని పోలి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి