Stock Market Today, 21 February 2024: మంగళవారం మరోమారు రికార్డు స్థాయికి చేరిన నిఫ్టీ, ఈ రోజు (బుధవారం) హడావిడి లేకుండా ఆరంభమయ్యే అవకాశం ఉంది. బెంచ్‌మార్క్ సూచీలను కదిలించే గట్టి ట్రిగ్గర్స్‌కు దేశీయంగా లేవు. గ్లోబల్ ట్రిగ్గర్స్ & స్టాక్ స్పెసిఫిక్ వార్తల ఆధారంగా పెట్టుబడిదార్లు నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 86 పాయింట్లు లేదా 0.39 శాతం గ్రీన్ కలర్‌లో 22,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం హాంగ్ సెంగ్ లోయర్ సైడ్‌లో ఉంది. ఇది తప్ప మిగిలిన మార్కెట్లన్నీ దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి, 0.1 శాతం నుంచి 0.7 రేంజ్‌లో ఉన్నాయి. యూఎస్ మార్కెట్లు లోయర్ సైడ్‌లో ముగియడం ఆసియా బెంచ్‌మార్క్‌లపై ప్రభావం చూపింది.
నిన్న, అమెరికన్ మార్కెట్లలో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.17 శాతం తగ్గింది. S&P 500 0.6 శాతం, టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.92 శాతం నష్టపోయాయి.
US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు 83.50 డాలర్ల వద్ద ఉంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
జీ ఎంటర్‌టైన్‌మెంట్: జీ ఫౌండర్లపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా, కంపెనీ నుంచి దాదాపు రూ.2,000 కోట్లు మళ్లించబడి ఉండొచ్చని సెబీ తేల్చింది. ఇది, తొలి అంచనాల కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.
హిందాల్కో: హిందాల్కో ఇండస్ట్రీస్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ & అట్లాంటా కేంద్రంగా పని చేస్తున్న నోవెలిస్, అమెరికాలో IPO కోసం దాఖలు చేసింది.
దేవయాని ఇంటర్నేషనల్: యమ్ రెస్టారెంట్ ఇండియా ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా ఈ కంపెనీలో 4.4 శాతం వరకు షేర్లను అమ్మబోతోంది. ఒక్కో షేరు ధరను రూ.153.50గా నిర్ణయించారు.
TVS సప్లై చైన్ సొల్యూషన్స్: రోల్స్ రాయిస్‌తో 2029 వరకు 5-సంవత్సరాల కాంట్రాక్ట్ పొడిగింపు ఖరారైంది.
పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి భారత్ బిల్ పేమెంట్ సిస్టంను (BBPS) బదిలీ చేయడానికి ఇతర బ్యాంకులతో వన్97 కమ్యూనికేషన్ ఒప్పందాలు చేసుకుంటోంది.
రిలయన్స్, టాటా పవర్: న్యూక్లియర్ పవర్‌లో ఒక్కో కంపెనీలో రూ. 44,000 పెట్టుబడి పెట్టడానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, అదానీ పవర్, వేదాంత సహా ఐదు ప్రైవేట్ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
ABB ఇండియా: డిసెంబర్ త్రైమాసికం లాభం 13 శాతం పెరిగి రూ.345 కోట్లకు చేరుకుంది. ఆదాయం 35 శాతం పెరిగి రూ.2,757 కోట్లకు చేరుకుంది.
యూనియన్ బ్యాంక్: QIP రూట్‌లో రూ.3,000 కోట్ల వరకు నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్: ఈ కంపెనీ ఓవర్సీస్ విభాగమైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇంటర్నేషనల్, విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ‘గ్లోబల్ స్టూడెంట్ హెల్త్ కేర్’ పేరుతో సమగ్ర యుఎస్ డాలర్ స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఒకే దెబ్బకు రెండు పిట్టలు - అధిక రాబడితో పాటు పన్ను నుంచి మినహాయింపు