పకోడిగాళ్లకూ సలహాలివ్వండి - చిరంజీవికి కొడాలి నాని కౌంటర్ !


వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి  చిరంజీవి చేసిన వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. గుడివాడ సమస్యలపై చర్చించేందుకు మచిలీపట్నం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన అక్కడ మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందన్నారు. చిరంజీవి వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ వరుసగా పవన్ కల్యాణ్‌ ఎప్పుడైనా విమర్శలు చేస్తే..  వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌లు ప్రెస్మీట్లు పెట్టి  చిరంజీవి చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వనున్నారు. ఇంకా చదవండి


దిగొస్తున్న టమాటా ధర - భారీగా తగ్గుదల, హైదరాబాద్‌లో ఎంతంటే?


నిన్న, మొన్నటి వరకు అందనంత ఎత్తులో ఆకాశంలో విహరించిన టమాట ధర క్రమంగా కిందకు దిగి వస్తోంది. రెండ్రోజుల నుంచి టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు కిలో టమాటా రూ. 200 లకు పైగా అమ్ముడు పోగా.. రూ. 300 దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ టమాటా ధర తగ్గుతోంది. కిలో టమాటాను రూ. 250కి పైగా అమ్మిన వ్యాపారులే ఇప్పుడు రూ. 63 విక్రయిస్తున్నారు. హైదరాబాద్ రైతు బజార్ లో కిలో టమాటా రూ. 63 గా ఉంది. బయట మార్కెట్లలో టమాటా ధర ఇంకా ఎక్కువగానే ఉంది. రూ. 120 నుంచి రూ. 140 వరకు విక్రయిస్తున్నారు. ఇంకా చదవండి


పుంగనూరు హింసాత్మక ఘటనలో మరో 9 మంది అరెస్టు


ఇటీవల పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం అనుమానితుల సంఖ్య 72కి చేరింది. పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు, ప్రధాన అనుమానితుడిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఇంకా చదవండి


పెండింగ్‌ బిల్లులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ లేఖలు- తెలంగాణలో అనూహ్య పరిణామం


తెలంగాణ ప్రభుత్వం - గవర్నర్ తమిళిసై మధ్య పరిస్థితి ఉప్పు - నిప్పులా ఉంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు రాజ్యాంగ వ్యవస్థలు ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులపై గవర్నర్ చర్య వార్తల్లో నిలిచింది. ఆర్టీసీ బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తడం సహా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం వంటివి జరిగాయి. గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలోనే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా అరుదుగా వాడే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 174(2) ను గవర్నర్ వాడారు. చాలా అరుదుగా మాత్రమే వాడే ఈ ఆర్టికల్ ను తమిళిసై అమలు చేయడం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా చదవండి


బెజవాడలో ఫుల్‌ సెక్యూరిటీ


ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను తక్షం పరిష్కరంచాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీగా అలర్ట్ అయ్యారు. జేఎసి ఆందోళన విరమించినప్పటికి పోలీసులు మాత్రం రిలాక్స్ అవ్వలేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇంకా చదవండి