ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను తక్షం పరిష్కరంచాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీగా అలర్ట్ అయ్యారు. జేఎసి ఆందోళన విరమించినప్పటికి పోలీసులు మాత్రం రిలాక్స్ అవ్వలేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. 


బెజవాడ చుట్టూ పోలీసులే...
బెజవాడను పోలీసులు చుట్టు ముట్టారు. ఎక్కడిక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు పిలుపునివ్వటం, ఆ తరువాత విరమించుకున్నప్పటికి పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. సెక్యూరిటీ టైట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 


ఏం జరుగుతుందో తెలియక సాధారణ ప్రజానీకం కంగారు పడ్డారు. గందరగోళానికి గురయ్యారు. విజయవాడకు వచ్చే మార్గాలన్నింటికి పోలీసులు చుట్టుముట్టారు. నగరంలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనఖీలు చేసిన అనుమానితులను ప్రశ్నించటంతోపాటుగా అదుపులోకి తీసుకొని కాసేపటికి తరువాత పంపేశారు. విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారుల్లోనూ ముందస్తు తనఖీలు జరిపారు. 


విద్యుత్ ఉద్యోగుల చలో విజయవాడ
డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని గుణదలలో ఉన్న విద్యుత్ సౌధ కార్యాలయాన్ని మట్టడించేందుకు విద్యుత్ ఉద్యోగుల జేఎసి గతంలో పిలుపునిచ్చింది. దీంతో 26జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొనేందుకు విజయవాడ బాట పట్టారు. అయితే ఉద్యోగులు చేపట్టే ఆందోళన ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచేదిగా మారటంతో సర్కార్ కూడా అప్రమత్తం అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల జేఎసితో అర్థరాత్రి వరకు చర్చలు జరిపింది. తాత్కాలికంగా ఆందోళన విరమించేలా వారిని ఒప్పించింది. అయితే అప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ఉద్యోగులు విజయవాడకు చేరుకునేందుకు ఆయా జిల్లాల నుంచి బయలుదేరారు. 


ప్రభుత్వ ఉద్యోగుల జేఎసి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. అప్పట్లో అది చాలా పెద్ద దుమారమే రేపింది. వేర్వేరు మార్గాల్లో ఉద్యోగులు విజయవాడకు ఉప్పెనలా చేరుకున్నారు. అప్పటి నుంచి ఉద్యమాల పట్ల ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వాటిని జరనీయకుండా వారితో చర్చలు జరపడం లేదంటే అరెస్టులతో నిలువరిస్తోంది. 


ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, ప్రభుత్వం ముందుగా అలర్ట్ అయ్యాయి. ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి వచ్చే నిరసనలకు చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల చలో విజయవాడ ఉద్యమం కూడ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి కంట్రోల్ చేయటంతో అందరూ రిలాక్స్ అయ్యారు. 


పోలీసు శాఖలో హై అలర్ట్...
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన పిలుపుతో విజయవాడ నగరం చుట్టు పక్కల మొత్తం రెండు వేల మంది పోలీసులను మోహరించారు. అంతే కాదు విద్యుత్ సౌధ భవనం, జాతీయ రహాదారికి దగ్గరగా ఉంటుంది. మరో వైపున ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల పర్యటలో ఉన్నారు. సాయంత్రానికి విజయవాడ రానున్నారు. అదే రూట్‌లో ఉద్యమం తీవ్ర ఎక్కువ ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు ఫుల్ అలర్ట్‌తో ఉన్నారు. సెక్యూరిటీని టైట్ చేశారు.