కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్ - సీఎం జగన్ ఆగ్రహం


వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్రజల కష్టాలు, అవసరాల నుంచి పుడితే టీడీపీ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు ఏపీ సీఎం జగన్. అక్కడ విజయం కోసం రెండు పార్టీలు ఇచ్చిన హామీలతో బిస్మిల్లా బాత్ వండేశారని ఎద్దేవా చేశారు. ఆయనకు తెలిసిన మోసాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆయన చేసిన ప్రకటనలు చూస్తే మారీచుడు, పూతన కథలు గుర్తుకు వచ్చాయని అన్నారు. ఇంకా చదవండి


కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ


విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనే కేశినేని నాని హాట్‌టాపిక్ అవుతున్నారు ఏదో కాంట్రవర్సీతో మీడియాలో ఆయన పేరు మారుమోగుతోంది. బుధవారం రోజున ఆయన చేసిన కామెంట్స్ మరింత వైరల్‌గా మారాయి. దీనిపై అటు వైసీపీ, టీడీపీ రెండూ సైలెంట్‌గానే ఉన్నాయి. అయితే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ మాత్రం సీరియస్‌గా స్పందిచారు. ఇంకా చదవండి


బీఆర్ఎస్, ఎంఐఎం షాడో బాక్సింగ్ మ్యాచ్‌కి కాంగ్రెస్‌ అంపైరింగ్: విజయశాంతి


ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని గతంలోనే ఎంఐఎం చెప్పిందని.. కానీ ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఒక్కసారి కూడా స్పందించలేదని అన్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లూ వాళ్ల చేతిలోనే స్టీరింగ్ ఉందన్న ఎంఐఎం.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ తమ చేతుల్లో లేదని చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అంతర్గత వ్యవహారం అని.. ఈ మూడు పార్టీలు అవిభక్త కవలలు అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ మూడు పార్టీలు ఎన్నికలకు ముందు లేదా తర్వాత పొత్తు పెట్టుకోవడమో, కూటమిగా మారడమో చేస్తుందని.. కానీ ఈ విషయం వారికి తప్ప ప్రజలెవరికీ తెలియదని ట్విట్టర్ వేధికగా వివరించారు. ఇంకా చదవండి


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు, అప్రూవర్‌గా నిందితుడు శరత్ చంద్రారెడ్డి


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  2022 నవంబర్  10వ తేదీన   ఈడీ అధికారులు  శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్  చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని  ఈడీ ఆరోపిస్తుంది.  ఈ విషయమై కోర్టుకు  సమర్పించిన చార్జీసీట్లలో  పలు అంశాలను  పేర్కొంది. ఇంకా చదవండి


త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్


ఏపీలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 57 నోటిఫికేషన్ల విడుదల చేసిందని, వీటి ద్వారా 5,447 పోస్టులను భర్తీ చేసిందని సవాంగ్ తెలిపారు. ఇంకా చదవండి